Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ‘జైలర్ 2 సూపర్ షో’లో రజనీకాంత్ సినిమాకి సంబందించిన కొన్ని విషయాలు పంచుకుంటూ.. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారో చెబుతూ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ బయటపెట్టారు. సినిమాలో నటించేందుకు మిథున్ చక్రవర్తి ఓ ఆసక్తికరమైన సరదా షరతు పెట్టారని తలైవా చెప్పుకొచ్చారు.
రజనీతో దెబ్బలు తినాలా? గెట్ లాస్ట్.. మిథున్ చక్రవర్తి రియాక్షన్
మిథున్ నాకు చాలా మంచి మిత్రుడు. మొదట మా ప్రొడక్షన్ టీమ్ ఆయన్ను సంప్రదించినప్పుడు.. ‘సినిమాలో నా రోల్ ఏంటి? ఒకవేళ విలన్ అయితే రజనీకాంత్ చేతిలో దెబ్బలు తినాలా? అలాగైతే నేను చేయను.. గెట్ లాస్ట్’ అని సరదాగా అన్నారట.
ఆ తర్వాత ‘వేవ్స్ సమ్మిట్’ (WAVES Summit) కార్యక్రమంలో మేమిద్దరం కలిసినప్పుడు ఈ సినిమా టాపిక్ వచ్చింది. ‘నువ్వు అడిగావు కాబట్టి నేను కచ్చితంగా చేస్తాను రజనీ.. కాకపోతే నాదొకటే కండిషన్. సినిమాలో నువ్వు నన్ను కొట్టకూడదు, కాల్చడం లాంటివి చేయకూడదు’ అని మిథున్ నాతో సరదాగా అన్నారు. దానికి నేను నవ్వుతూ.. డైరెక్టర్ నెల్సన్‌తో మాట్లాడి చెబుతానని అన్నాను అంటూ రజనీకాంత్ ఆనాటి ముచ్చట్లను గుర్తుచేసుకున్నారు.
దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసిన రజనీ – మిథున్..
