Prabhas Month

Prabhas Month: : ‘ఫౌజీ’ గ్లింప్స్ నుంచి ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వరకు.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు అక్టోబర్ 23న ట్రిపుల్ ధమాకా పక్కానా?!

Prabhas Month: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న వస్తుండటంతో.. అప్పుడే సోషల్ మీడియాలో ‘బర్త్‌డే మంత్’ సెలబ్రేషన్స్ షురూ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులకు అక్టోబర్ నెల అంటేనే ఒక పెద్ద పండుగ. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో సందేహాలు, ఎన్నో అప్‌డేట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పుట్టినరోజు వేదికగా మేకర్స్ నుంచి రాబోయే అనౌన్స్‌మెంట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ‘ఫౌజీ’ నుంచి ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వరకు ఈ అక్టోబర్ 23న ఎలాంటి సర్ ప్రైజ్‌లు ఉండబోతున్నాయో ఓ లుక్కేద్దాం..
1. హను రాఘవపూడి ‘ఫౌజీ’ – బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ రానుందా?..
ప్రస్తుతం ప్రభాస్ శరవేగంగా షూటింగ్ జరుపుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ఈ సినిమా మొదట అనుకున్న డిసెంబర్ 3న థియేటర్లలోకి రావడం లేదని, విడుదల కాస్త వాయిదా పడుతుందని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్ బిజీగా ఉన్నప్పటికీ.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు దర్శకుడు హను రాఘవపూడి ఓ అదిరిపోయే స్పెషల్ గ్లింప్స్‌ను కట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో ప్రభాస్ అటు పీరియడ్ యాక్షన్ హీరోగా, ఇటు తన వింటేజ్ మార్క్ రొమాంటిక్ హీరోగా రెండు వేరియేషన్లలో కనిపించనుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
2. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ – సర్ ప్రైజ్ ఉంటుందా.. వాయిదా పడుతుందా?..
ప్రభాస్ లైనప్‌లో అందరినీ అత్యంత ఎగ్జైట్ చేస్తున్న మరో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించి మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వలేదు.సాధారణంగా ప్రత్యేక సందర్భాలను తనదైన రా అండ్ రస్టిక్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసే సందీప్.. ప్రభాస్ బర్త్‌డేకి ఏదైనా అదిరిపోయే కాన్సెప్ట్ పోస్టర్ లేదా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇవ్వాలని భావిస్తున్నారు.
ప్రభాస్ గనక ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, మొత్తం బజ్ దానికే ఉండాలని భావిస్తే మాత్రం.. సందీప్ తన ప్రణాళికలను కాస్త వెనక్కి నెట్టి, తర్వాత అప్‌డేట్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఆదిపురుష్ సినిమా సమయంలో కూడా ప్రభాస్ మొత్తం బజ్ ఆదిపురుష్ పైనే ఉండాలని సాలార్ ఇంకా కల్కి సినిమాల అప్డేట్ లు బయటికి రాకుండా ఆపేశాడు.
3. నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ – పట్టాలెక్కేది ఈ నెలలోనే!..

గ్లోబల్ సెన్సేషన్ సృష్టించిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ‘కల్కి 2’ షూటింగ్ పనులు ఈ అక్టోబర్ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి 2’ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభం గురించి లేదా చిన్న కాన్సెప్ట్ టీజింగ్ పోస్టర్ రూపంలో మూవీ టీమ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వెలువడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తానికి అక్టోబర్ 23న డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే రోజున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ అని చెప్పొచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *