Kalki Bhagavan: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ (విజయ్‌కుమార్) కన్నుమూశారు. గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించే సమయానికి కుమారుడు కృష్ణాజీతో పాటు ఆశ్రమానికి చెందిన దాసాజీలు, ట్రస్టు ప్రతినిధులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. కల్కి భగవాన్ మృతి వార్త తెలియడంతో దేశ, విదేశాల్లోని ఆయన భక్తులు, అనుచరుల్లో తీవ్ర విషాదం అలముకుంది.
ఏకం ఆలయంలో అంతిమ దర్శనం – శనివారం అంత్యక్రియలు:
-
భక్తులకు ప్రత్యేక ధ్యాన తరగతులు, ‘ముక్తి దీక్ష’ వంటి కార్యక్రమాలను అందించడం ద్వారా ఆయనకు విశేష ఆదరణ లభించింది.
-
కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్, వన్నెస్ హ్యూమన్, లోకా ఫౌండేషన్, ముక్తి వంటి పేర్లతో పలు స్వచ్ఛంద ట్రస్టులను నెలకొల్పి వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అమెరికా, యూరప్ వంటి విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఏకం ఆలయానికి వచ్చేవారు.
