Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీ లో ఎంత గ్లామర్ ఉంటాదో అంతకు మించి తెరవెనుక ఆర్థిక లావాదేవీలు, డిస్ట్రిబ్యూషన్ వివాదాలు ఎంతటి చీకటి కోణాలను ఉంటాయో చెప్పే మరో పెద్ద వివాదం టాలీవుడ్లో రచ్చకెక్కింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా బిజినెస్ వ్యవహారంపై డిస్ట్రిబ్యూటర్, ‘హను-మాన్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అధినేత చైతన్య రెడ్డి ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ సంచల విషయాలు బయటపెట్టారు. ఈ సినిమా పంపిణీ హక్కుల వల్ల తాము ఏకంగా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నష్టపోయామని, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ తమను పూర్తిగా మోసం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సినిమా ఆగితే మా కెరీర్, జీవితం ముగిసిపోతుంది అన్నారు..
తెలుగు సినీ చరిత్రలో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ చుట్టూ ‘లైగర్’ వివాదం తర్వాత, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ వ్యవహారం కూడా ఆయన ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైమ్ షో నిర్మాతలు చేసిన ఈ బాంబు లాంటి ఆరోపణలపై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వారి వివరణ వస్తేగానీ ఈ వివాదంలో పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
