Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌పై అత్యంత కీలక ప్రకటన చేశారు. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ భారత జట్టు తరఫున తనకు చివరి ప్రపంచకప్ అని ఆయన ధ్రువీకరించారు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జియోస్టార్ షో వేదికగా కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారాయి. ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ.. 2027 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలకనున్నారనే వార్త కోట్లాది మంది అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.
కప్పు గెలవడానికి సర్వశక్తులూ ధారపోస్తా.. విరాట్ కోహ్లీ
2027 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురంలో సెప్టెంబర్ 27న తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30న రెండో వన్డే, అక్టోబర్ 3న మూడో వన్డే జరగనున్నాయి. 2027 క్వాలిఫైయర్స్‌కు సిద్ధమవుతున్న వెస్టిండీస్‌కు, రోహిత్-కోహ్లీ ద్వయానికి ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది.
