Accident: కళ్లముందే అల్లారుముద్దుగా తిరుగుతూ ఆడుకుంటున్న పసికందును వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు సరుకులు కొనే పనిలో ఉండగా, ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన చిన్నారిని ఓ స్కార్పియో కారు అతివేగంగా ఢీకొట్టి, చిన్నారి శరీరంపై నుంచి దూసుకెళ్లింది. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సాంచోర్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
అసలేం జరిగింది?
తమ కళ్లముందే చిన్నారి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు చూపరులను తీవ్రంగా కలచివేశాయి.
🚫TRIGGER WARNING🚫
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు కింద నలిగి చిన్నారి మృతి
రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సాంచోర్లో విషాద ఘటన
చిన్నారిని వెంటేసుకొని.. ఓ కిరాణా స్టోర్కు వెళ్లిన కుటుంబ సభ్యులు
స్టోర్లో వాళ్లు సామాన్లు కొంటుండగా.. ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన చిన్నారి
సరిగ్గా అదే… pic.twitter.com/HTdll2ELQo
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 26, 2026
