The paradise

The Paradise Collections: బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. డే-1 ఏకంగా రూ.88 కోట్ల గ్రాస్..!

The Paradise Collections: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్‌లతో కలిపి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. ఇది నాని సినీ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డే-1 ఓపెనింగ్‌గా సరికొత్త హిస్టరీ గా రికార్డు సష్టించింది.

బాక్సాఫీస్ Day-1 కలెక్షన్ల వివరాలు

  • ప్రపంచవ్యాప్త వసూళ్లు: ట్రేడ్ వర్గాల (Sacnilk) లెక్కల ప్రకారం సినిమా మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 76.90 కోట్ల గ్రాస్ నమోదు చేయగా.. మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ప్రకారం ప్రీమియర్లతో కలిపి వసూళ్లు రూ. 88 కోట్లను తాకాయి.
  • భారత్‌లో నెట్ వసూళ్లు: దేశవ్యాప్తంగా 9,732 షోల నుంచి మొదటి రోజు దాదాపు రూ. 34.65 కోట్ల నెట్ (సుమారు రూ. 54.90 కోట్ల ఇండియా గ్రాస్) రాబట్టింది.
  • ఓవర్సీస్ మార్కెట్లలో రికార్డ్: నార్త్ అమెరికాలో $1.55 మిలియన్ల మార్కును దాటి దూసుకుపోతోంది. మొత్తం ఓవర్సీస్ మార్కెట్ల నుంచి మొదటి రోజే దాదాపు $2.25 మిలియన్లు (రూ. 22 కోట్ల గ్రాస్) వసూలు చేసి నాని స్టామినాను నిరూపించింది.

నాని కెరీర్ పాత రికార్డులు గల్లంతు..

‘ది ప్యారడైజ్’ సాధించిన ఈ తొలి రోజు వసూళ్లు నాని గత సినిమా రికార్డులను భారీ తేడాతో వెనక్కి నెట్టేశాయి..
  • హిట్: ది థర్డ్ కేస్ (2025): తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 37.81 కోట్ల గ్రాస్ (ఇండియా నెట్ రూ. 21 కోట్లు) సాధించగా, దాన్ని రెట్టింపు మార్జిన్‌తో దాటేసింది.
  • దసరా (2023): శ్రీకాంత్ ఓదెలతో చేసిన మొదటి సినిమా తొలి రోజు రూ. 36.28 కోట్ల గ్రాస్ (రూ. 23.20 కోట్ల నెట్) వసూలు చేసింది.
  • సరిపోదా శనివారం (2024): మొదటి రోజు రూ. 19.34 కోట్ల గ్రాస్ (రూ. 9 కోట్ల నెట్) నమోదు చేసింది.

కథ & తారాగణం నేపథ్యం..

1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని ‘జడల్ జమానా’ అనే మాస్ పాత్రలో నటించారు. భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే అట్టడుగు వర్గాల యువకుడిగా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.
విలన్ ‘షికంజా మాలిక్’గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కొడుకు విక్రమ్ మాలిక్ పాత్రలో రాఘవ్ జుయల్ నటించారు.
కథానాయిక సుబ్బుగా కాయదు లోహర్ మెరవగా.. సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో, కీర్తి సురేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం, సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు.

తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. ప్రీ-రిలీజ్ హైప్, నాని-శ్రీకాంత్ క్రేజ్ వల్ల మొదటి రోజు కలెక్షన్ల వర్షం కురిసింది. మొదటి వారాంతం (ఫస్ట్ వీకెండ్) తర్వాత కూడా సినిమా ఇదే ఊపును కొనసాగిస్తుందా లేదా అనేది బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది.

The Paradise Collections

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *