Gold Seize: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని, దుబాయ్ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు బంగారు చైన్లపై స్ప్రే రంగులు పూసి సాధారణ ఆభరణాలుగా భ్రమింపజేస్తూ అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు పక్కా నిఘాతో పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 9 కోట్ల విలువైన 6.5 కిలోల బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు, ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ సహా మొత్తం 8 మంది సభ్యులను అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు.
