Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం దక్కింది. మహిళల క్రికెట్ ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి అద్భుత విజయంతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్ చెలరేగిపోగా.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మన అమ్మాయిలు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, గత ఆసియా క్రీడల ఛాంపియన్ టైటిల్‌ను భారత్ ఘనంగా నిలబెట్టుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ – మంధాన, షఫాలీ ఊచకోత..
షఫాలీ, దీప్తి స్పిన్ మ్యాజిక్ – 69 రన్స్‌కే లంక ఆలౌట్..
బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసిన షఫాలీ వర్మ.. ఇమేషా దులని, హసిని పెరీరాలను వెంటవెంటనే పెవిలియన్ పంపి లంకను గట్టి దెబ్బ కొట్టింది. కాసేపు పోరాడే ప్రయత్నం చేసిన లంక కెప్టెన్ చమరి అటపట్టు (29 రన్స్)ను దీప్తి శర్మ అద్భుత బంతితో బోల్తా కొట్టించింది. భారతి ఫుల్మాలి క్యాచ్ పట్టడంతో అటపట్టు నిరాశగా వెనుదిరిగింది. అటపట్టు వికెట్ పడ్డాక లంక ఇన్నింగ్స్ కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగగా, మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయింది.
చరిత్ర పునరావృతం..
2023 హాంగ్జౌ ఆసియా క్రీడల ఫైనల్లోనూ భారత్ శ్రీలంకను ఓడించి తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే శ్రీలంకపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి భారత్ వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని ముద్దాడింది. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు ఖాతా తెరిచిన తొలి పతకం.. అదీ బంగారు పతకం కావడం విశేషం.
