Pension Scheme

Pension: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనపు పెన్షన్ 10%, 15 శాతానికి పెంపు..!

AP Pension Scheme: ఆంధ్రప్రదేశ్‌లోని రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వయసు పైబడిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ (Additional Pension) శాతాన్ని పెంచుతూ ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వయస్సు పెరిగే కొద్దీ పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన అదనపు పెన్షన్ వివరాలు..

ప్రస్తుతం అందుతున్న 7 శాతం అదనపు పెన్షన్‌ను 10 శాతానికి పెంచారు. ప్రాథమిక పెన్షన్‌పై ఇకపై 10 శాతం చొప్పున అదనపు మొత్తం లభిస్తుంది. ప్రస్తుతం ఇస్తున్న 12 శాతం అదనపు పెన్షన్‌ను 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 80 ఏళ్లు, ఆపైబడిన పెన్షనర్లకు ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని, వారికి పాత రేట్లే యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

సవరించిన ఈ నూతన అదనపు పెన్షన్ నిబంధనలు డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన పెన్షన్ నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన పెరిగిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు 2027 జనవరి 1వ తేదీన వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెలా అందే చేతికొచ్చే సొమ్ము పెరిగి ఆర్థికంగా భారీ ఊరట కలగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *