paradise

The Paradise: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 1-మినిట్ బ్యాంగర్ రిలీజ్ టీజర్.. బుకింగ్స్‌పై మేకర్స్ పక్కా ప్లాన్!

The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise) విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు అనుమతులతో ఫుల్ జోష్‌లో ఉన్న చిత్ర యూనిట్.. తాజాగా సెన్సార్ ప్రక్రియ, ప్రమోషన్స్ మరియు టికెట్ బుకింగ్స్‌కు సంబంధించిన కీలక ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.

నేడే సెన్సార్ సర్టిఫికెట్..

సెన్సార్ బోర్డ్ సూచించిన అభ్యంతరాలు (అబ్జెక్షన్స్), మార్పులను చిత్ర యూనిట్ వెంటనే సరిదిద్ది (కరెక్షన్స్) తిరిగి బోర్డుకు సమర్పించింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తవడంతో నేడే సినిమాకి సంబంధించిన అధికారిక సెన్సార్ సర్టిఫికెట్ చేతికి రానుంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో 1-మినిట్ బ్యాంగర్ రిలీజ్ టీజర్..
ఈ సినిమా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ ఒక సాలిడ్ 1-మినిట్ ‘బ్యాంగర్’ రిలీజ్ టీజర్‌ను సిద్ధం చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ అధికారికంగా రాగానే, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ అదిరిపోయే రిలీజ్ టీజర్‌ను ప్రదర్శించి అభిమానులకు, ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు.
ఆలస్యం లేకుండా ఆన్‌టైమ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్:
ఇటీవల కొన్ని భారీ చిత్రాల విషయంలో సెన్సార్ మరియు టికెట్ ధరల జీవోల ఆలస్యం కారణంగా ఆన్‌లైన్ బుకింగ్స్ చివరి నిమిషంలో తెరుచుకోవడం కలెక్షన్లపై ప్రభావం చూపింది. అలాంటి ఎలాంటి నష్టం (డ్యామేజ్) జరగకుండా ‘ది ప్యారడైజ్’ మేకర్స్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.సెన్సార్ ప్రక్రియ పూర్తవుతుండటంతో, నిర్దేశిత సమయానికే అన్ని ప్రధాన టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్‌ను ప్రారంభించేలా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *