NTA Exam Calendar: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2027 (JEE Main-2027) సెషన్-1 పరీక్ష తేదీలతో పాటు పలు జాతీయ ప్రవేశ పరీక్షల వార్షిక కేలండర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న కీలక పరీక్షల ప్రాథమిక షెడ్యూల్‌ను ఇందులో పొందుపరిచింది. అభ్యర్థులు, విద్యాసంస్థలు తమ ప్రిపరేషన్, అకడమిక్ ప్లానింగ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవడానికి ఈ కేలండర్ ఉపకరిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్ 2027 సెషన్-1 పరీక్షల షెడ్యూల్..
ఎన్‌టీఏ పరీక్షల కేలండర్ (డిసెంబర్ 2026 – మార్చి 2027)..
| పరీక్ష పేరు | ప్రతిపాదిత తేదీలు |
| రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC) | 06 డిసెంబర్ 2026 |
| స్వయం (SWAYAM) | 08 – 12 డిసెంబర్ 2026 |
| రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ | 13 డిసెంబర్ 2026 |
| యూజీసీ నెట్ (UGC-NET – డిసెంబర్ సైకిల్) | 14 – 19 డిసెంబర్ 2026 (బఫర్: 20–21 డిసెంబర్) |
| జాయింట్ CSIR UGC-NET (డిసెంబర్ సైకిల్) | 20 – 21 డిసెంబర్ 2026 |
| ఆర్మీ క్యాడెట్స్ కాలేజ్ | 04 జనవరి 2027 |
| శ్రేష్ఠ (SHRESHTA – NETS) | 10 జనవరి 2027 |
| నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NIFT) | 10 జనవరి 2027 |
| జేఈఈ మెయిన్ – సెషన్ 1 (JEE Main) | 22–24, 28–30 జనవరి 2027 (బఫర్: 31 జనవరి) |
| ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE) | 31 జనవరి 2027 |
| సిమ్యాట్ (CMAT – మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్) | 07 ఫిబ్రవరి 2027 |
| ఎన్ఐటీటీటీ (NITTT – పార్ట్ 1) | 26 – 27 ఫిబ్రవరి 2027 |
| సీయూఈటీ-పీజీ (CUET-PG) | 01–05, 08, 12–20, 24–25 మార్చి 2027 (బఫర్: 30–31 మార్చి) |
| ఎన్ఐటీటీటీ (NITTT – పార్ట్ 2) | 05 & 07 మార్చి 2027 |
అభ్యర్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు..
-
తేదీలు తాత్కాలికమే:కేలండర్‌లో పేర్కొన్న తేదీలు ప్రాథమికమైనవి (Tentative) మాత్రమేనని, పాలనాపరమైన, లాజిస్టికల్ లేదా ఇతర అనివార్య కారణాల వల్ల అవసరమైతే ఈ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని ఎన్‌టీఏ వెల్లడించింది.
-
ప్రత్యేక నోటిఫికేషన్లు త్వరలో:
ఈ కేలండర్ కేవలం అకడమిక్ అవగాహన కోసమేనని, ప్రతి పరీక్షకు సంబంధించిన అధికారిక దరఖాస్తు నోటిఫికేషన్లు, ఎగ్జామ్ సిటీ సమాచారం, అడ్మిట్ కార్డులు తదితర వివరాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో వేర్వేరుగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక పోర్టల్‌ను పరిశీలించాలని సూచించింది.
