Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్‌లో అదిరిపోయే బజ్ మొదలైంది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’లో నటిస్తున్న మహేష్.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ్గ చేర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు తెరపైకి రావడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న తన తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’ (Love and War) షూటింగ్ పనులు పూర్తి కావడంతో.. భన్సాలీ తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు.
భన్సాలీ మార్క్ పీరియాడిక్ డ్రామా – మహేష్‌తో చర్చలు..
ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. మహేష్ లైనప్‌లో ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్ల పేర్లు ఉన్నాయి. ‘వారణాసి’ పూర్తిగా ముగిసిన తర్వాతే మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ భన్సాలీ-మహేష్ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం భారతీయ తెరపై అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.
