Eshwar Sai Wife Sharanya

Eshwar Sai Wife Sharanya: ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య.. ఐసీయూలో పరిస్థితి విషమం..!

Eshwar Sai Wife Sharanya: తెలుగు జానపద పాటలతో పాపులర్ అయిన డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల గొడవ చివరకు పెను విషాదానికి దారితీసింది. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ జరగడం తెలిసిందే. అయితే, ఈ గొడవల్లో తీవ్ర మనస్తాపానికి గురైన ఈశ్వర్ సాయి భార్య శరణ్య తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతోంది, పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. చనిపోవడానికి ముందు శరణ్య రికార్డ్ చేసిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న శరణ్య ఆడియోలో ఏముంది?
నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. నా భర్త ఈశ్వర్ లేకపోతే నేను అస్సలు బతకలేను. నా జీవితాన్ని అందరూ కలిసి ఆగమాగం చేసేశారు. చావు తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఈ మోసాన్ని, ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి నా కొడుకుని మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఏడుస్తూ మాట్లాడింది.
అసలేం జరిగింది?

ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి రక్షణ ఉంది. అంతకుముందు ఈశ్వర్ సాయి, మాధురి ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండగా భార్య శరణ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో పెద్ద రచ్చే జరిగింది. ఈ గొడవల వల్ల కొద్దిరోజుల క్రితం మాధురి రాథోడ్ కూడా సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. ఇప్పుడు భర్త చేసిన మోసం, సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్ తట్టుకోలేక శరణ్య కూడా ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా, పోలీసులు ఆడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *