YSRCP: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడి నాలుగు నెలల క్రితమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సులతో వేటు..
రేపల్లె పార్టీ సమన్వయకర్తగా ఉన్న మోహన్‌ను గెలిపించే బాధ్యతను మోపిదేవి శ్రీనివాసరావు తీసుకోవాలని, ఆయన చేసే సేవలను గుర్తించి భవిష్యత్తులో చట్టసభల్లో కుర్చీ వేసి కూర్చోబెడతానని స్వయంగా జగన్ ప్రకటించారు. అలా పార్టీలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే, ఏకంగా క్రమశిక్షణా చర్యల పేరుతో ఆయనపై వేటు పడటం బాపట్ల జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
