Viral News

Viral News: నెల రోజుల తర్వాత యజమాని ఇంటికి వస్తే.. బాల్కనీలో కుక్క ఎమోషనల్ రియాక్షన్ చూశారా?

Viral News: విశ్వాసం, స్వచ్ఛమైన ప్రేమ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే జీవి శునకం (కుక్క). మనుషులైనా కొన్నిసార్లు మొహం చాటేస్తారేమో గానీ, మూగజీవి ఒకసారి తన మనసులో చోటు ఇచ్చిందంటే ప్రాణమున్నంత వరకు ఆ యజమానిని మర్చిపోదు. సరిగ్గా ఇలాంటి ఒక గుండెల్ని హత్తుకునే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్ల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. నెల రోజుల పాటు దూరంగా ఉండి ఇంటికి తిరిగి వచ్చిన యజమానిని చూసి ఆ పెంపుడు కుక్క చూపించిన ప్రేమ మాటల్లో వర్ణించలేనిది!

బాల్కనీలో ఎదురుచూపులు – కళ్ల ముందే ఆత్మీయుడు..

జాకీ (jakky.08) అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఆ పెంపుడు కుక్క ఇంటి బాల్కనీలో నిలబడి ఎవరి కోసమో ఆత్రుతగా చూస్తూ ఉంటుంది. దాదాపు నెల రోజుల తర్వాత చేతిలో లగేజ్ బ్యాగ్‌తో తన యజమాని గేటు వద్దకు చేరుకోవడం ఆ కుక్క కంటపడుతుంది. కింద ఉన్న యజమాని కూడా ఆనందంతో తన పెంపుడు జంతువు వైపు చూసి చేయి ఊపుతాడు.
యజమాని రూపం కనిపించడమే ఆలస్యం.. ఆ శునకం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే బాల్కనీ నుంచి పరుగు పరుగున మెట్లు దిగి, గేటు వద్దకు వచ్చి తోక ఆడిస్తూ యజమాని ఒడిలోకి దూకేందుకు తహతహలాడింది.
నెటిజన్లు ఫిదా – లక్షల్లో వ్యూస్..

ఈ చిన్న వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా దీనిని వీక్షించి ఎమోషనల్ అవుతున్నారు.. “ఇలాంటి నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమను మూగజీవులు మాత్రమే పంచగలవు” అంటూ ఒకరు భావోద్వేగంగా కామెంట్ చేశారు. “మనిషికి మనిషిపై కూడా ఇంత నిజాయితీ ఉండదేమో.. కుక్కల విశ్వాసానికి హ్యాట్సాఫ్” అని మరొకరు రాసుకొచ్చారు. ఏ స్వార్థం లేకుండా, కేవలం మనుషుల స్పర్శ, ప్రేమ కోసం తపించే ఇలాంటి జీవుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని నెటిజన్లు ఏకగ్రీవంగా వ్యాఖ్యానిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @jakyy.08

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *