AE Nookaraju Family Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో గుండెలు పిండేసే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాదిక్ ఖాన్ చేసిన మానసిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్లు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్న తీరు పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ఎలాంటి తప్పూ చేయని ఒక కుటుంబం ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి నిందితుడి బెదిరింపులే ప్రధాన కారణమని పోలీసుల విచారణలో స్పష్టమవుతోంది.
ప్రొటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి హత్య..
7 రోజుల కస్టడీ కోరిన పోలీసులు..
ఈ కుట్ర వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలను వెలికితీసేందుకు, హత్యకు ఉపయోగించిన ఆధారాలను సేకరించేందుకు నిందితుడు సాదిక్ ఖాన్ను 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ సర్పవరం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు కూడా న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక కుటుంబం పరువు, ప్రాణాలతో చెలగాటమాడిన ఈ కేసులో నిందితుడికి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.
