AP News

AP News: ఏపీకి పెట్టుబడుల పండగ.. 21 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు!

 AP News: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సరికొత్త ఊపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం (ఆగస్టు 12, 2026) జరిగిన 20వ ‘రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు’ (SIPB) సమావేశంలో ఏకంగా రూ. 2,08,406 కోట్ల విలువైన 25 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం ముద్ర వేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు 21,627 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
విశాఖ, అనకాపల్లికే సింహభాగం – ‘డేటా సెంటర్లు’ హవా!
ఈ సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 84 శాతానికి పైగా (రూ. 1,75,330 కోట్లు) ఒక్క ఉత్తరాంధ్రలోనే కేటాయించడం విశేషం..
  • రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ (Anakapalli): అనకాపల్లి జిల్లాలో రూ. 85,200 కోట్ల పెట్టుబడితో 1,880 ఉద్యోగాలు.
  • డేటా సెంటర్ హోల్డింగ్స్ (Visakhapatnam): విశాఖపట్నంలో రూ. 58,743 కోట్ల వ్యయంతో 1,250 ఉద్యోగాలు.
  • ఏఎమ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (Visakhapatnam): రూ. 31,387 కోట్లతో 1,000 ఉద్యోగాలు.
డేటా సెంటర్లకు నీటి కొరత వస్తుందనే ప్రచారాన్ని ఖండిస్తూ, ఈ ప్రాజెక్టులకు కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని, పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి గ్రావిటీ ద్వారా విశాఖ ప పరిశ్రమలకు నీరందిస్తామని సీఎం వెల్లడించారు.
మిగతా జిల్లాల్లో కీలక ప్రాజెక్టులు & ఉద్యోగాలు..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు ఇతర పరిశ్రమలకు కూడా ఆమోదం లభించింది:
  1. కడప కొప్పర్తి (Kopparthi Cluster): డిక్సన్ ఇండియా (AIL Dixon) సంస్థ రూ. 450 కోట్లతో అత్యధికంగా 7,000 ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించనుంది.
  2. కాకినాడ: వారి క్లీన్ ఎనర్జీ (Waaree) రూ. 15,000 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి.
  3. కర్నూలు: అగస్త్య గ్రీన్ ఎనర్జీ (రూ. 7,800 కోట్లు – 1,000 ఉద్యోగాలు), జాక్సన్ గ్రీన్ (రూ. 1,533 కోట్లు).
  4. శ్రీకాకుళం మూలపేట: కోరమండల్ ఇంటర్నేషనల్ రూ. 2,125 కోట్ల పెట్టుబడి.
  5. నెల్లూరు & తిరుపతి: నెల్లూరు మనుబోలు వద్ద VPR మైనింగ్ రూ. 500 కోట్లు (2,000 ఉద్యోగాలు), తిరుపతిలో మునోత్ లిథియం బ్యాటరీ సంస్థ రూ. 500 కోట్ల పెట్టుబడి.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు:

  • ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు: పరిశ్రమలకు ఇచ్చే ఇన్సెంటివ్‌లను వచ్చే డిసెంబర్ నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా నేరుగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
  • 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు: వచ్చే సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తేవాలన్నారు.
  • మూలపేట పోర్టు డిసెంబర్‌కు పూర్తి: శ్రీకాకుళం మూలపేట పోర్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, రాయలసీమ ఉద్యానవన పంటల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునేలా రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

గ్రీన్ అమ్మోనియా, లిథియం ఐయాన్ బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *