Donald Trump

Donald Trump: ఇరాన్ దెబ్బ.. క్యాటరింగ్ ట్రక్కులో పారిపోయిన డోనాల్డ్ ట్రంప్..!

Donald Trump: టర్కీలో జరిగిన నాటో (NATO) సమ్మిట్ ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయాణం చుట్టూ ఒక భారీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా నడిచింది. ఖతార్ బహుమతిగా ఇచ్చిన విలాసవంతమైన కొత్త బోయింగ్ విమానాన్ని కాదని, పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ బయలుదేరడంపై మొదట్లో రకరకాల చర్చలు నడిచాయి.
అయితే, దీని వెనుక అసలు నిజం వేరే ఉందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వాషింగ్టన్ పోస్ట్’ బాంబు పేల్చింది. ఇరాన్ నుండి వచ్చిన అతి తీవ్రమైన ప్రాణహాని (Assassination Threat) బెదిరింపుల కారణంగా, ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని కేవలం డమ్మీగా (Decoy) ఉపయోగిస్తూ, ట్రంప్‌ను అత్యంత రహస్యంగా ఒక సైనిక విమానంలో టర్కీ నుంచి తరలించినట్లు సంచలన కథనాన్ని వెలువరించింది.

క్యాటరింగ్ ట్రక్కులో ఎస్కేప్ – కేవలం డమ్మీగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’!

అంకాచ్ విమానాశ్రయంలో అందరి కళ్ల ముందే కెమెరాలకు చేతులు ఊపుతూ ట్రంప్ పెద్ద విమానం ఎక్కినట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత అసలైన డ్రామా మొదలైంది..
  1. క్యాటరింగ్ ట్రక్కు సహాయంతో: అధ్యక్షుడి విమానంలోకి ఆహార పదార్థాలు అందించే ఒక క్యాటరింగ్ ట్రక్కును పాత ఎయిర్ ఫోర్స్ వన్ తలుపు వద్దకు తెచ్చారు. ఆ ట్రక్కు కంటైనర్ ద్వారా ఎవరి కంటా పడకుండా ట్రంప్‌ను, ఆయన ముఖ్య అనుచరులను కిందకు దింపేశారు.
  2. చిన్న మిలిటరీ జెట్‌లోకి తరలింపు: ఆ క్యాటరింగ్ ట్రక్కులోనే రన్‌వే దాటించి, సమీపంలో సిద్ధంగా ఉన్న C-32A (రూపాంతరం చెందిన బోయింగ్ 757) అనే చిన్న మిలిటరీ విమానంలోకి ట్రంప్‌ను ఎక్కించారు.
  3. జర్నలిస్టులకే తెలియని సీక్రెట్: జర్నలిస్టులు, వైట్ హౌస్ సిబ్బంది అంతా ట్రంప్ తమతోనే పెద్ద విమానంలో ప్రయాణిస్తున్నారని భావించగా.. ట్రంప్ మాత్రం వేరే మిలిటరీ జెట్‌లో ప్రయాణించి బ్రిటన్‌లోని సైనిక స్థావరానికి చేరుకున్నారు. రెండు విమానాలు కొద్ది నిమిషాల వ్యవధిలోనే బ్రిటన్‌లో ల్యాండ్ అయ్యాయి.

ఖతార్ ఇచ్చిన విమానం భద్రతపై అనుమానాలు!

ఖతార్ ప్రభుత్వం అమెరికాకు గిఫ్ట్‌గా ఇచ్చిన కొత్త బోయింగ్ 747-8 విమానంలో డిఫెన్స్ కౌంటర్ మేజర్ సరిగ్గా లేవని, శత్రుదేశాల దాడులను తట్టుకునే సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదనే వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఇరాన్ ముప్పు నేపథ్యంలో పాత విమానంతో డ్రామా ఆడి, అంతకంటే సురక్షితమైన ఆర్మీ జెట్‌లో ట్రంప్‌ను తరలించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

గతంలో 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా శత్రువుల దాడి నుండి రక్షించుకోవడానికి ఇలాంటి డమ్మీ విమానం వ్యూహాన్నే వాడారు. ఏది ఏమైనా అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ఎయిర్‌పోర్ట్‌లో సాగిన ఈ హాలీవుడ్ స్థాయి సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *