Harish Rao: తెలంగాణలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘మిషన్ భగీరథ’ (Mission Bhagiratha) పథకం నేటితో విజయవంతంగా పదేళ్లు (10 Years) పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
-
కష్టాలకు చరమగీతం: ఒకప్పుడు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచే మహిళల కష్టాలను, వేసవి నీటి ఎద్దడిని తీర్చడానికి కేసీఆర్ ఈ బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
-
సుజల ధామం: గోదావరి, కృష్ణా నదుల ఉపరితల జలాలను సేకరించి, శుద్ధి చేసి, విస్తృతమైన పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, తండాలు, మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు స్వచ్ఛమైన నీటిని అందించారని వివరించారు.
-
దేశానికే రోల్ మోడల్: తెలంగాణను పీడించిన ఫ్లోరైడ్ రాక్షసిని శాశ్వతంగా రూపుమాపిన ఈ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘హర్ ఘర్ జల్’ (Har Ghar Jal) పథకానికి కూడా దిశా నిర్దేశం చేసిందని చెప్పారు.
“కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థ నిర్వీర్యం!”
“రాజకీయ కక్షలతో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పథకాలను పక్కన పెట్టడం తీవ్రమైన నేరం. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల గతంలో నిరంతరం ప్రవహించిన నల్లాలు ఇప్పుడు ఎండిపోయే పరిస్థితి వస్తోంది. ప్రభుత్వాలు మారినా ప్రజల అవసరాలు మారవు. ఇప్పటికైనా రాజకీయాలను పక్కనపెట్టి దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు నిరంతర నీటిని అందించాలి.”— తన్నీరు హరీశ్ రావు (మాజీ మంత్రి)
10 Years of #MissionBhagiratha 💧
10 Years of Dignity.
10 Years of Transformation.A decade ago, Telangana embarked on a mission that transformed the lives of millions forever.
Mission Bhagiratha was not just a drinking water project – it was an engineering marvel
Launched… pic.twitter.com/yRrc98lmP0
— Harish Rao Thanneeru (@BRSHarish) August 7, 2026
