Vande Bharat: రోజువారీ ఆఫీసు పనులు, “9 టు 5” రూటీన్ లైఫ్‌తో విసిగిపోయి కాస్త రిలాక్స్ అవ్వాలని ఉందా? సెలవులు దొరకడం లేదని బాధపడుతున్నారా? ఇక ఆ ఆందోళన అవసరం లేదు! భోజన ప్రియులు, పర్యాటకుల కోసం ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ ప్రయాణాన్ని ఎంత హైస్పీడ్, లగ్జరీగా మార్చిందో తెలుసా?
ఉదయం ఢిల్లీలో హాయిగా టీ తాగి బయలుదేరితే, మధ్యాహ్నం వేరే నగరంలో కమ్మటి భోజనం చేసి, రాత్రికి తిరిగి మన ఇంట్లో హాయిగా పడుకోవచ్చు. ఢిల్లీ నుంచి వందే భారత్ రైలులో ఒక్క రోజులోనే (One Day Trip) వెళ్ళి రాగలిగే 5 అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఇవే..
1. ఆగ్రా (Agra)
చరిత్ర, వినూత్న కట్టడాలను చూడాలనుకునే వారికి ఆగ్రా బెస్ట్ ఛాయిస్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మిమ్మల్ని రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే ఆగ్రాకు తీసుకెళ్తుంది.
-
ఏం చూడవచ్చు?: ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ ఇంకా ఫతేపూర్ సిక్రీలను సందర్శించవచ్చు.
-
ప్రత్యేకత: అక్కడ దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్, ఆగ్రా పేట రుచి చూసి, సాయంత్రం రైలులో హాయిగా తిరిగి రావచ్చు.
2. చండీగఢ్ (Chandigarh)
తన అందం, పరిశుభ్రతకు పేరుగాంచిన చండీగఢ్ నగరం చేరడానికి ఢిల్లీ నుంచి కేవలం 2 గంటల 50 నిమిషాలు మాత్రమే పడుతుంది.
-
ఏం చూడవచ్చు?: వ్యర్థాలతో సృష్టించిన అద్భుత కళాఖండాల ‘రాక్ గార్డెన్’, ప్రశాంతమైన ‘సుఖ్నా సరస్సు’. షాపింగ్ ప్రియులైతే సెెక్టర్-17 మార్కెట్‌ను అస్సలు మిస్ అవ్వకూడదు.
3. హరిద్వార్ (Haridwar)
నగరాల భాగదోడుకు దూరంగా, కాస్త ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరుకునే వారికి హరిద్వార్ సరిగ్గా సరిపోతుంది. వందే భారత్‌లో ఇక్కడికి ప్రయాణం 4 గంటల 15 నిమిషాలు.
-
ఏం చూడవచ్చు?: గంగా నది ఒడ్డున కూర్చుంటే లభించే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. కేబుల్ కార్ (రోప్‌వే) ద్వారా మన్సా దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.
-
ముఖ్య గమనిక: సాయంత్రం వేళ ‘హర్ కీ పౌడీ’ వద్ద జరిగే విశ్వ ప్రసిద్ధ గంగా హారతి ని చూసేలా మీ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి.
4. జైపూర్ (Jaipur)
రాజస్థాన్ ప్రాభవానికి ప్రతీక అయిన ‘పింక్ సిటీ’ జైపూర్ వెళ్లాలనుకుంటే.. వందే భారత్ ద్వారా ఈ ప్రయాణం ఇప్పుడు కేవలం 4 గంటల 40 నిమిషాలు మాత్రమే!
-
ఏం చూడవచ్చు?: అద్భుతమైన హవా మహల్, ప్రసిద్ధ ఆమేర్ కోట (ఆంబర్ ఫోర్ట్) అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
5. డెహ్రాడూన్ (Dehradun)
వీకెండ్‌లో పచ్చని కొండలు, చల్లటి గాలిని ఆస్వాదించాలనుకుంటే.. ఢిల్లీ నుంచి వందే భారత్‌లో 5 గంటల కంటే తక్కువ సమయంలోనే డెహ్రాడూన్ చేరుకోవచ్చు. మార్గమధ్యంలో కనిపించే కొండ కోనల దృశ్యాలు మైమరపిస్తాయి.
-
ఏం చూడవచ్చు?: అడ్వెంచర్ ఇష్టపడేవారు ‘రాబర్స్ కేవ్’ (Robber’s Cave) సందర్శించవచ్చు. అంతేకాకుండా ఇక్కడి కేఫ్‌లలో కూర్చుని రుచికరమైన కాఫీ ఆస్వాదించవచ్చు.
ప్రయాణానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు:
వసతులు: వందే భారత్ రైళ్లలో అత్యుత్తమ AC కోచ్‌లు, సౌకర్యవంతమైన పుష్-బ్యాక్ సీట్లు ఇంకా లోపలే లభించే రుచికరమైన ఆహారం ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.
అడ్వాన్స్ బుకింగ్: ఈ రైళ్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ట్రిప్ ప్లాన్ చేసుకోగానే ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.
రోజంతా ప్రయాణ అలసట లేకుండా, వీకెండ్‌ను ఎంచక్కా రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ‘వందే భారత్’ వన్ డే ట్రిప్స్ ఓ చక్కటి మార్గం!
