Govt CJP Meet

Govt CJP Meet: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఒక రోజు గడువు.. 2 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే.. ?

Govt CJP Meet: నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం మరియు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో సుదీర్ఘంగా జరిగిన చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

1. సీజేపీ ఉంచిన 3 ప్రధాన డిమాండ్లు

సమావేశం సందర్భంగా సీజేపీ నాయకులు కేంద్ర మంత్రులకు తమ డిమాండ్ల నోట్‌ను సమర్పించారు. వారి ప్రధాన వినతులు ఇవే..

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజీ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా కొట్టివేయాలి.

2. కేంద్ర ప్రభుత్వం స్పందన

సీజేపీ కోరిన మూడింటిలో రెండు డిమాండ్లకు (కేసుల ఉపసంహరణ మరియు బాధిత కుటుంబాలకు పరిహారం) కేంద్రం సానుకూలంగా స్పందించిందని ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.పేపర్ లీకేజీల నివారణకు కొత్త కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నామని, కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రులు వెల్లడించారు.

3. రాజీనామాపై ఒక రోజు గడువు!

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కేంద్రం ఒక రోజు (రేపటి వరకు) సమయం కోరిందని సీజేపీ తెలిపింది. కేంద్రం రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ ఆయనను తొలగించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని, రాజీనామా వరకు తమ ఉద్యమం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *