Irumudi: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నుండి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్రారంభించారు. ‘మజ్ను’, ‘నిన్ను కోరి’ వంటి ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన మొదటి సింగిల్ ‘ఇరుముడి కట్టు’ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ రావడం, దానికి తోడు సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించడంతో ఈ పాటపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
ఆధ్యాత్మిక భావోద్వేగాల ‘ఇరుముడి కట్టు’
‘ఇరుముడి కట్టు’ కేవలం ఒక సినిమా పాటలా కాకుండా, ప్రతి అయ్యప్ప భక్తుడి మనసుకు హత్తుకునేలా అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక భావోద్వేగాలతో రూపుదిద్దుకుంది.
మండల దీక్ష నియమ నిష్ఠలను, అయ్యప్ప స్వామి భక్తి సారాన్ని జి.వి. ప్రకాశ్ కుమార్ తన అద్భుతమైన ట్యూన్స్‌తో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పతాక స్థాయికి తీసుకెళ్లారు. పాట ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఒక్కరిలో భక్తి పారవశ్యాన్ని కలిగించేలా ఈ సాంగ్ సాగింది.
ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా ప్రముఖ రచయిత కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించడం విశేషం. అయ్యప్ప మాల ధరించిన ఒక భక్తుడు 41 రోజుల పాటు పాటించే క్రమశిక్షణ, ఇరుముడి కట్టుకుని శబరిమల క్షేత్రానికి వెళ్లే పవిత్ర యాత్రను ఈ లిరిక్స్ ఎంతో హృద్యంగా ఆవిష్కరించాయి.
గాయకుడు అనంతు తన పవర్ఫుల్ గొంతుతో పాడిన విధానం ఈ పాటకు ప్రాణం పోసింది. ప్రతి పదంలోనూ భక్తి రసాన్ని కురిపిస్తూ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు చేర్చారు.
అయ్యప్ప స్వామి భక్తుడిగా రవితేజ ఒద్దికైన లుక్
మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ చూడని విధంగా ఈ పాటలో ఒక నిఖార్సైన అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో లీనమైపోయారు. నల్లటి దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలతో రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన హావభావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాబా భాస్కర్ మాస్టర్ అందించిన కోరియోగ్రఫీ పాటలోని భక్తి తత్వానికి సరైన దృశ్యరూపాన్ని ఇచ్చింది. ఇక ఈ పాటలో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర కనిపించే ఎమోషనల్ సీన్లు సినిమాలోని అసలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి.
మొత్తంమీద ‘ఇరుముడి కట్టు’ పాట ఒక సోల్ ఫుల్ డివోషనల్ ఆల్బమ్‌గా నిలిచిపోవడమే కాకుండా, సినిమా అందించబోయే హృదయపూర్వకమైన ఎమోషనల్ జర్నీకి గట్టి పునాది వేసింది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
