Fast Food Addiction: ఆకలి లేకపోయినా ఏదో ఒకటి నమలాలనే ఫీలింగ్ చాలామందికి వచ్చే ఉంటుంది. మెదడు ఇచ్చే ఈ అకాల ‘క్రేవింగ్స్’ (తినాలనే కోరికలు) వల్లే మనకు తెలియకుండానే ఓవర్ ఈటింగ్ వైపు వెళ్తాం. ఇది క్రమంగా బరువు పెరగడం, ఇతర లైఫ్ స్టైల్ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కేవలం జిమ్‌కు వెళ్లడం లేదా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడం వల్లే వెయిట్ కంట్రోల్ అవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మెదడు నుంచి వచ్చే జంక్ ఫుడ్ క్రేవింగ్ సిగ్నల్స్ అంత ఈజీగా ఆగవు. మరి ఈ సమస్యను అధిగమించాలంటే.. మనకు నచ్చిన ఆహారాన్ని కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్‌నే ఇష్టపడేలా మెదడును ఎలా రీ-ట్రైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మెదడుకు కొత్త విషయాలు నేర్పినట్లే, మన ఈటింగ్ హ్యాబిట్స్‌ను మార్చుకోవడానికి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వవచ్చు.
ఆలోచనా విధానాన్ని మార్చుకోండి (మైండ్ సెట్):
మన బ్రెయిన్ ఎప్పుడూ ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఎక్కువ క్యాలీల ఫుడ్స్ (బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్) వైపు మొగ్గు చూపుతుంది. ఆరోగ్యకరమైన తక్కువ క్యాలరీల ఆహారం తిన్నప్పుడు త్వరగా తృప్తి కలగదు. దీనిని బ్రేక్ చేయాలంటే.. “ఈ హెల్తీ ఫుడ్ నా బాడీకి పూర్తి పోషకాలను ఇస్తోంది” అని గట్టిగా అనుకోవడం ప్రారంభించాలి. కొన్ని రోజుల పాటు ఈ విధమైన అవగాహనతో తింటే, మెదడు కూడా దానికి అలవాటుపడి జంక్ ఫుడ్ కోరికలను తగ్గించేస్తుంది.
వంటకాల్లో కాస్త వెరైటీ, క్రియేటివిటీ:
ఆరోగ్యకరమైన ఆహారం అనగానే చాలామంది చప్పగా ఉంటుందని భావిస్తారు. అలా కాకుండా హెల్తీగా ఉండే పదార్థాలను కూడా రంగురంగులుగా, ప్లేటింగ్ ఆకర్షణీయంగా ఉండేలా తయారు చేసుకోండి. కంటికి నచ్చిన ఆహారం మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్‌ను పంపుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన తిండిపై మనకు తెలియకుండానే ఇష్టం పెరుగుతుంది.
డైట్లో బోర్ కొట్టనివ్వకండి:
రోజువారీ మెనూలో బోర్ కొట్టడం వల్లే చాలామంది మళ్లీ జంక్ ఫుడ్స్ వైపు మళ్లుతారు. అందుకే రోజూ ఒకే రకమైన డైట్ కాకుండా.. ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు కూరగాయలు, నట్స్, పండ్లతో కూడిన విభిన్న రకాల హెల్తీ వెరైటీలను ట్రై చేయండి.
తినే ముందు ఒక్క క్షణం ఆలోచించండి:
ఎప్పుడైనా అన్‌హెల్తీ స్నాక్స్ లేదా స్వీట్స్ తినాలనిపించినప్పుడు.. ఇది నా హెల్త్‌కు అవసరమా? దీనివల్ల నా బాడీకి ఏమైనా మేలు జరుగుతుందా? అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ చిన్న ప్రశ్న మీ మైండ్‌లో జంక్ ఫుడ్ పట్ల కాస్త నెగిటివ్ భావనను తెస్తుంది. తద్వారా ఆ ఫుడ్‌ను పక్కన పెట్టడం సులువవుతుంది.
ప్లేట్ సైజ్ తగ్గించండి (పోర్షన్ కంట్రోల్):
ఫిట్‌గా ఉండటమే మీ టార్గెట్ అయినప్పుడు చిన్న ప్లేట్లలో తినడం మంచి అలవాటు. పెద్ద ప్లేట్లు ఉంటే ఎక్కువ క్వాంటిటీ వడ్డించుకునే ఛాన్స్ ఉంటుంది. అదే చిన్న ప్లేట్ అయితే తక్కువ పరిమాణంలో తిన్నా కడుపు నిండినట్లు మెదడు భ్రమిస్తుంది. పోర్షన్ కంట్రోల్ చేయడానికి ఇది చాలా స్మార్ట్ ట్రిక్.
