Aadarsha Kutumbam47

Aadarsha Kutumbam47: వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Aadarsha Kutumbam47: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా వినిపిస్తున్న రీషూట్ల రూమర్లకు ఇంకా వాయిదా గాసిప్స్‌కు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాను దసరా కంటే కాస్త ముందే, అంటే గాంధీ జయంతి సెలవు దినాన్ని పురస్కరించుకుని అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన సరికొత్త పోస్టర్‌లో వెంకటేశ్, శ్రీనిధి శెట్టి మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా ఎంతో చూడముచ్చటగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.

సినీ ప్రియులకు వెంకటేశ్-త్రివిక్రమ్ అనగానే ‘నువ్వు నాకు నచ్చావ్’ (2001), ‘మల్లీశ్వరి’ (2004) వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్స్ గుర్తొస్తాయి. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కాంబోలో అంటే డైరెక్టర్ గా త్రివిక్రమ్ హీరో గా వెంకటేష్ గా వస్తున్న పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో వెంకటేశ్ ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక మధ్యతరగతి త్రండ్రిగా తనదైన మార్క్ కామెడీ ఇంకా ఎమోషన్స్‌తో అలరించనున్నారు. ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, దివ్యేందు, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం ఇంటి తలుపులు తెరుచుకోనున్నాయి.. ప్రతి ఫ్యామిలీ ఈ డేట్‌ను లాక్ చేసుకోండి అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. కాగా, గత ఏడాది 2025 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్ బెస్ట్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న వెంకటేశ్, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 5వ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘ఆదర్శ కుటుంబం’, వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో విక్టరీ వెంకటేశ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *