IRCTC New Website

IRCTC తత్కాల్ బుకింగ్‌కు కొత్త వెబ్‌సైట్.. జూలై 15 లోపు ప్రయాణికులు ఈ 3 పనులు చేయడం మర్చిపోవద్దు!

IRCTC New Website: రైలు టికెట్లు, ముఖ్యంగా తత్కాల్ బుక్ చేసుకోవడం అనేది భారతీయ ప్రయాణికులకు ఒక పెద్ద యుద్ధం లాంటిదే. కరెక్ట్‌గా ఉదయం 10 గంటలవ్వగానే సైట్ హ్యాంగ్ అవ్వడం, తిరుగుతూనే ఉండే లోడింగ్ వీల్, పిచ్చిపిచ్చిగా వచ్చే క్యాప్చా కోడ్‌లు, చివర్లో అయ్యే పేమెంట్ ఫెయిల్యూర్స్.. ఇలా ఒకటా రెండా, ప్రయాణికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఈ దశాబ్దాల తలనొప్పికి త్వరలోనే రైల్వే శాఖ చెక్ పెట్టబోతోంది. జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ (MNIT) విద్యార్థులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఈ సమస్యలపై ఫిర్యాదు చేయడంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి.. జూలై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని డెడ్‌లైన్ పెట్టారు.

మనల్ని ఇరకాటంలో పెట్టే 5 ప్రధాన సమస్యలు:

ప్రస్తుత వెబ్‌సైట్‌లో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్న కొన్ని సాంకేతిక లోపాలు ఇవే..

  • లాగిన్ అడ్డంకులు: లాగిన్ అయ్యేటప్పుడు వచ్చే క్యాప్చా ఇమేజ్‌లు అస్సలు అర్థం కావు.
  • ఆటోమేటిక్ లాగౌట్: టికెట్ సెలెక్ట్ చేసుకునే లోపే అకౌంట్ సెషన్ టైమౌట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది.
  • ఓటీపీ (OTP) ఆలస్యం: పేమెంట్ పేజీకి వెళ్లాక సమయానికి బ్యాంక్ ఓటీపీలు రావు.
  • డబ్బులు కట్ – టికెట్ ఫెయిల్: సీట్లు కళ్లముందే అయిపోతాయి, కానీ పేమెంట్ ఫెయిల్ అయి డబ్బులు కట్ అవుతాయి.

గమనిక: ఏజెంట్లు, ఏఐ బాట్స్ (AI Bots) సామాన్యుల కంటే ముందే టికెట్లను అక్రమంగా బుక్ చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే 2.5 కోట్ల నకిలీ/అనుమానాస్పద ఐడీలను బ్లాక్ చేసింది. అయినప్పటికీ సర్వర్ స్లో ప్రాబ్లం మాత్రం తగ్గలేదు.

జూలై 15న కొత్త సైట్ వస్తోంది.. ప్రయాణికులు ఏం చేయాలి?

కొత్త ప్లాట్‌ఫామ్‌ లైవ్‌లోకి వచ్చే లోపు సాధారణ యూజర్లు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం:

  1. లాగిన్ వివరాలు దాచుకోండి: పాత సైట్ నుండి కొత్త సైట్‌కు మారేటప్పుడు రీ-వెరిఫికేషన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇప్పుడే ఎక్కడైనా సురక్షితంగా రాసి పెట్టుకోండి.
  2. రీఫండ్స్ & వాలెట్ చెక్: మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ వాలెట్‌లో డబ్బులు ఉన్నా, లేదా పాత టికెట్ల పెండింగ్ రీఫండ్‌లు ఏవైనా ఉన్నా వాటి స్టేటస్ ముందే చూసుకోండి.
  3. ముందస్తు బుకింగ్స్ బెస్ట్: సాధారణంగా ఏదైనా కొత్త వెబ్‌సైట్ ప్రారంభమైన మొదటి రోజు కొన్ని సాంకేతిక ఇబ్బందులు (Glitches) రావడం సహజం. అందుకే జూలై 15 ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణాలు ఉన్నవారు.. ఆ రోజే బుక్ చేయకుండా అంతకంటే ముందే టికెట్లు కొనేయడం సురక్షితం.

యాప్‌లో మార్పులు లేవు!

ఈ రాబోయే సరికొత్త అప్‌డేట్ మరియు సులభమైన లాగిన్ ప్రక్రియ కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్‌కు (డెస్క్‌టాప్/బ్రౌజర్) మాత్రమే పరిమితం. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో మార్పుల గురించి రైల్వే మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు.ఏదేమైనా, జూలై 15 నుంచి రాబోతున్న ఈ కొత్త మార్పులు తత్కాల్ టికెట్ బుకింగ్‌ను ఎంతవరకు ఈజీ చేస్తాయో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *