TG: తెలంగాణ ఐసెట్ (TS ICET) రాసిన అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమీకృత ప్రవేశ పరీక్ష (TS ICET) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను లాంఛనంగా విడుదల చేశారు. ఫలితాలతో పాటు అభ్యర్థుల ఫైనల్ కీ, మరియు ర్యాంక్ కార్డులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన ప్రకటించారు.
ముగిసిన ప్రిలిమినరీ కీ అభ్యంతరాల ప్రక్రియ:
రాష్ట్రవ్యాప్తంగా మే 13 మరియు 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ ఐసెట్ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే.పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే విద్యామండలి ప్రిలిమినరీ కీ (Primary Key)ని విడుదల చేసి, అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించింది.నిపుణుల కమిటీ సమక్షంలో ఆ అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన అనంతరం, తుది కీ (Final Key)ని ఖరారు చేస్తూ ఈరోజు తుది ఫలితాలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
మీ ఐసెట్ ర్యాంక్ కార్డును ఇలా పొందండి:
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నతాధికారులు సూచించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి కింద పేర్కొన్న వివరాలను ఎంటర్ చేయడం ద్వారా తమ ఫలితాలను స్క్రీన్‌పై చూడవచ్చు:
-
ఐసెట్ హాల్‌టికెట్ నంబర్ (ICET Hall Ticket Number)
-
రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number)
-
పుట్టిన తేదీ (Date of Birth)
ఈ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ బటన్ నొక్కగానే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ ర్యాంక్ కార్డు అత్యంత కీలకం కాబట్టి, అభ్యర్థులు దీనిని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలని విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్: తెలంగాణ ఐసెట్ ఫలితాలు మరియు మీ ర్యాంక్ కార్డును నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ను సందర్శించవచ్చు.
