Tailors

Tailors: బట్టలు కుట్టడం వస్తే చాలు.. అమెరికాలో లక్షలు సంపాదించొచ్చు..!

Tailors: ఇండియాతో పోలిస్తే అమెరికాలో టైలరింగ్ (కుట్టుపని) వృత్తికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని వివరిస్తూ ఇండియాకి చెందిన కోమల్ పాండే అనే ఆమె వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ  వీడియో షేర్ చేశారు. ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది. అమెరికాలో టైలరింగ్ చేసేవారికి గౌరవం కూడా ఎక్కువగానే ఇస్తారు, అలాగే వాళ్ళు చేసిన పని చిన్నదైనా కూడా భారీ మొత్తంలో చెల్లిస్తారు అని వివరించారు. ఇండియాలో రోజు మొత్తం చేసిన సంపాదన 1000 నుండి 1500 వరకు మాత్రమే ఉంటుంది. కానీ అమెరికాలో దీనికంటే ఎక్కువ ఒక్క గంటకే సంపాదిస్తారు. అక్కడ గంటకి 25 డాలర్ల వరకు చెల్లిస్తారు, అంటే మన కరెన్సీలో చూస్తే 2200 నుండి 2300 వరకు అన్నమాట. బట్టలు కుట్టడంలో అనుభవం ఉంటే ఇయర్ మొత్తం మీకు పని ఉంటుంది.

ఇండియాలో ప్రతి గల్లీలో ఒక్క టైలర్ ఉంటాడు. మనం ఏదైనా బట్టలు సైజ్ చేయించాలి అనుకుంటే 100 రూపాయల లోపే పూర్తవుతుంది. అమెరికాలో అందరూ రెడీమేడ్ డ్రెస్సులు కొంటారు, కానీ అవి అందరికీ సరిపోవు. వాటిని తమకు సరిపోయే విధంగా ఫిట్ చేయించుకుంటారు. కేవలం ప్యాంట్ సైజ్ చేయించాలి అంటే 40 డాలర్ల వరకు ఛార్జ్ చేస్తారు, అంటే 4000 వరకు అన్నమాట. ఇది చూస్తుంటే చిన్నప్పుడు పెద్దలు చెప్పే ఒక్క విషయం గుర్తొస్తుంది.. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు అనే మాటే గుర్తొస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *