Viral Video: చిన్నప్పుడు అమ్మ లేదా నాన్న ఎవరైనా ఒకరు వచ్చి చిన్న పిల్లలను స్కూల్లో దింపేవారు. లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితో, పక్కింటి పిల్లలతో స్కూల్ కి పంపించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు పేరెంటింగ్ లో కూడా మార్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లోడిని స్కూల్ లో దింపడానికి ఓ తెలివిగల తల్లి ఏకంగా పోర్టర్ ని బుక్ చేసి స్కూల్ కి పంపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ పోర్టర్ పార్ట్నర్ ఓ ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టగా.. బయటికి వచ్చిన యువతి, పోర్టర్ నుండి వచ్చారా అని అడుగుతుంది. దానికి అతను అవును అని చెప్పి, నేను తీసుకువెళ్లవలసిన సామాన్లు ఎక్కడ అని అడగగా.. ఆమె పిల్లోడిని స్కూల్ లో దింపేయండి అంటుంది.
పిల్లవాడికి బండి మీద కూర్చునే వయసు కూడా కాదు, కింద పడిపోతాడు.. మీరే వెళ్లి దింపేయండి అంటే, దానికి ఆమె వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్లిపోయాడు, స్కూల్ బస్సు మిస్ అయింది, బాబుని ముందు కూర్చోబెట్టుకొని వెళ్ళండి అంటూ చెపుతూ బాబుని ఆయనకి అప్పగిస్తుంది. ఆయన ఈరోజు పిల్లోడిని స్కూల్ లో దించడానికి వెళ్తున్నా అంటూ వీడియో ముగిస్తాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అలా ఎలా తెలియని వ్యక్తికి బాబుని అప్పగిస్తారు, ఏదైనా జరిగితే ఏంటి అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం టెక్నాలజీ రావడంతో బద్దకం పెరిగిపోయింది, అందుకే పిల్లోడిని స్కూల్ లో దించడానికి కూడా పోర్టర్ బుక్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
It looks staged but still hilarious. India is not for beginners!
😂 Peak Indian parenting! Mom books a Porter to drop her tiny kid in full school uniform 😂
“Please baby ko school tak drop ker do” – Lil bro looks already done with life at 3!
We walked kilometres with heavy bags… pic.twitter.com/mZxvwEj1JJ— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 28, 2026
