Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఒక మంచి వార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులు, డిమాండ్ కారణాల వల్ల గత కొంతకాలంగా రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు ఇప్పుడు కొద్దికొద్దిగా దిగివస్తున్నాయి. సోమవారం ధరలు కాస్త పెరిగినప్పటికీ, మంగళవారం నుంచి ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ తగ్గింపు పెద్దగా లేకపోయినా, పసిడి ప్రియులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమేనని చెప్పవచ్చు.

తాజా ధరల ప్రకారం.. దేశంలో అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర తగ్గి రూ. 1,58,880 కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై రూ. 10 తగ్గి రూ. 1,45,640 గా నమోదైంది. బంగారంతో పాటే వెండి కూడా కొద్దిగా తగ్గింది. కిలో వెండి ధరపై రూ. 100 మేర తగ్గి ప్రస్తుతం రూ. 2,84,900 లుగా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి, స్థానిక పన్నులను బట్టి కొద్దిగా మారుతుంటాయి.

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,58,880 గాను, 22 క్యారెట్ల ధర రూ. 1,45,640 గాను ఉంది. ఇక ఇక్కడ కిలో వెండి ధర రూ. 2,94,900 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,59,030 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,45,790 గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ. 2,84,900 గా నమోదైంది.

ఇతర ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరులలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,58,880 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,45,640 గా స్థిరంగా ఉంది. కానీ వెండి ధర ముంబైలో రూ. 2,84,900 ఉండగా, బెంగళూరులో రూ. 2,84,800 గా ఉంది. మరోవైపు చెన్నైలో బంగారం ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,60,680 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,290 గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ. 2,94,900 గా కొనసాగుతోంది. స్థానిక డిమాండ్, రాష్ట్ర పన్నుల ఆధారంగానే ఈ ధరల వ్యత్యాసం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *