PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ చేరుకున్నారు. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకున్న ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మెలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు. డిన్నర్ ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు రోమ్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ చారిత్రక కట్టడం ‘కొలిసియం’ను సందర్శించారు.
ఈ పర్యటనలో కొలిసియం దగ్గర ప్రధాని మోదీ, జార్జియా మెలోని కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఒక సెల్ఫీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న మంచి స్నేహబంధానికి, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవానికి ఈ సెల్ఫీ ఒక నిదర్శనంగా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే.
మెలోనితో దిగిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అటు ఇటలీ ప్రధాని మెలోని సైతం ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “వెల్కమ్ టు రోమ్ మై డియర్ ఫ్రెండ్” అంటూ పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లో వీరి ఫోటోలే ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
ఈ ఫోటోలను షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాలను రాసుకొచ్చారు. రోమ్ నగరంలో అడుగుపెట్టిన వెంటనే ప్రధాని మెలోనితో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నానని, ఆ తర్వాత ప్రతిష్టాత్మక కొలిసియంను సందర్శించానని చెప్పారు. ఈ సందర్భంగా తామిద్దరం పలు కీలక అంశాలపై ఆలోచనలను పంచుకున్నామని.. భారత్, ఇటలీ దేశాల మధ్య స్నేహాన్ని, సంబంధాలను మరింత ఎలా బలోపేతం చేసుకోవాలనే దానిపై ఇవాళ జరగబోయే సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు మోదీ పేర్కొన్నారు.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
