Rukmini Vasanth

Rukmini Vasanth: సినిమా కంటే ‘స్టోరీ వరల్డ్’ ముఖ్యం.. రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rukmini Vasanth: అందరూ హీరోయిన్లు కెరీర్‌లో ఏదో ఒక్క సమయంలో తన చుట్టూ తిరిగే కథలో నటించాలని, తన పాత్ర సినిమాని మలుపు తిప్పేలా ఉండే క్యారెక్టర్స్ వస్తే చేయాలనుకుంటారు. కానీ ఈమె మాత్రం పాత్ర ఏదైనా పర్లేదు, నా పాత్ర చుట్టే సినిమా స్టోరీ తిరగాల్సిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.

లాస్ట్ ఇయర్ ‘కాంతార 2’ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రుక్మిణి వసంత్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె ప్రస్తుతం యశ్‌తో ‘టాక్సిక్’ సినిమాలో, ఇంకా ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తూ.. తను సినిమాల్లో క్యారెక్టర్స్‌ని ఎలా ఎంచుకుంటారో తెలిపారు. స్టోరీ వరల్డ్ కొత్తగా ఉండాలి, ఈ వరల్డ్ లో మనం కూడా ఓ పార్ట్ అయితే బాగుండు అనేలా అనిపిస్తే చాలు.. ఇంకా అందులో నా క్యారెక్టర్ ఎలా వెళ్తుంది అనే విషయాలు చూసుకుంటాను. ప్రతిసారి తన క్యారెక్టర్ స్టోరీని మలుపు తిప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు స్టోరీలో క్యారెక్టర్ కి ప్రాధాన్యత లేకపోయినా పర్లేదు. ‘కాంతార’ ఎంచుకోవడానికి కూడా ఇదే రూల్ పాటించాను. ఎలాగంటే.. ఇంతకు ముందు వచ్చిన కాంతార సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా, స్టోరీ వరల్డ్ డిఫరెంట్ గా ఇంకా అందులో కొత్త సంప్రదాయాలు ఉంటాయి.. వాటి గురించి తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకో సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సినిమా నుండి ఇంకో సినిమా చేయడానికి అవకాశం పక్కా రావాలి.

కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చింది, అప్పుడు చాలా భయమేసేది. వాళ్లతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు మన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే సమస్యే. యశ్ ‘టాక్సిక్’ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు యశ్ నటించిన అన్ని సినిమాలను గుర్తుతెచ్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. యశ్‌ని మొదటి సారి కలిసినప్పుడు కూడా వాటన్నిటినీ గుర్తుతెచ్చుకున్నాను. అలాగే ఆయనకు ఉన్న దృఢసంకల్పం, వర్క్ ఎథిక్స్ నాకు నచ్చాయి అన్నారు. ప్రతి స్టార్ హీరో నుంచి మనం ఏదో ఒక్కటి నేర్చుకోవచ్చు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *