Raaka: అల్లు అర్జున్ ఇంకా అట్లీ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘రాకా’ సినిమాపైన అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పాడుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే రీసెంట్ గా దీపికా పాడుకోన్ ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. దీంతో సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లలో యాక్ట్ చేస్తే ప్రెగ్నన్సీకి ఇబ్బంది కలుగుతుందని, దీంతో ఆమె క్యారెక్టర్ తగ్గించాలని, అది కుదరకపోతే ఆమెని రీప్లేస్ చేసి ఇంకో హీరోయిన్ ని తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలపైన స్పందించిన మూవీ టీమ్ ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేసింది. దీపికా పాడుకోన్‌ని వేరే హీరోయిన్ తో రీప్లేస్ చెయ్యడం లేదని తేల్చి చెప్పింది. అలాగే ఆమె క్యారెక్టర్ తగ్గిస్తున్నట్టు అనుకుంటున్నారు కానీ ఆమెది ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రని, దాన్ని తగ్గించడానికి కుదరదని చెప్పారు. ఈ సినిమాలో ఆమె కొన్ని ఫైట్ సీన్స్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.
సాయి అభ్యంకర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తుంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కి తరచుగా రావాల్సి ఉండటంతో, అల్లు అర్జున్ ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని నెలకు సుమారు 16 లక్షల రెంట్ తో తీసుకున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌ని 3 ఇయర్స్ లీస్ కి తీసుకోవడం విశేషం.
