Horoscope Today:
మేషం (Aries)
మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, తెలివితేటలతో వ్యవహరిస్తే వాటిని సులభంగా అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది.
పరిహారం: నిరంతరం దైవచింతనతో ఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
వృషభం (Taurus)
ఈరోజు మీరు విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది.
పరిహారం: ఇష్టదైవ ప్రార్థన మీకు మేలు చేస్తుంది.
మిథునం (Gemini)
మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి చేయడానికి ఏకాగ్రత చాలా అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండి కాలాన్ని పొదుపు చేసుకోండి. సాహసోపేతమైన నిర్ణయాలు ఈరోజు మీకు విజయాన్ని అందిస్తాయి.
పరిహారం: శివారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer)
ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తు కోసం చేసే చర్చలు ఫలిస్తాయి.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం పెరుగుతుంది.
సింహం (Leo)
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభపడే సూచనలు ఉన్నాయి. అయితే శారీరక శ్రమ పెరుగుతుంది, తగినంత విశ్రాంతి తీసుకోండి. ఇతరులతో గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి.
పరిహారం: శని శ్లోకాన్ని పఠించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
కన్య (Virgo)
నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్ ఉంది.
పరిహారం: గణపతిని ఆరాధిస్తే పనులు వేగంగా పూర్తవుతాయి.
తుల (Libra)
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో పెద్దల మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మనసు ప్రశాంతంగా ఉండే సమయం.
పరిహారం: శివాష్టోత్తరం పఠించడం శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio)
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా అడుగు వేసి మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆహారం, నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటించండి. బద్ధకాన్ని వదిలి చురుగ్గా పనిచేయండి.
పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించి తీపి కబురు వింటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సమయపాలన పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేస్తారు.
పరిహారం: శ్రీ విష్ణు ఆలయ సందర్శనం వల్ల అంతా మంచే జరుగుతుంది.
మకరం (Capricorn)
ఈరోజు మీకు అన్ని విధాలా అనుకూల కాలం. మీ రంగంలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అధికారులతో జరిపే చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. బంధువులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
పరిహారం: శ్రీ విష్ణు ఆరాధన శుభకరం.
కుంభం (Aquarius)
వ్యాపార రంగంలోని వారు తమ తెలివితేటలతో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ, సహనంతో పనులు పూర్తి చేస్తారు. మీకు ఇష్టమైన వారితో గడిపే అవకాశం లభిస్తుంది.
పరిహారం: శ్రీ మహావిష్ణువును ధ్యానించడం మంచిది.
మీనం (Pisces)
చేపట్టిన పనుల్లో మిత్రుల సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆత్మీయులను, బంధువులను దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి.
పరిహారం: శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది.
