Sharwanand:

Sharwanand: చిరంజీవి తర్వాత బన్నీనే నాకు ఇన్స్పిరేషన్

Sharwanand: చిరంజీవి తర్వాత నన్ను అంతగా ఇన్‌స్పైర్ చేసింది బన్నీ (అల్లు అర్జున్) అని శర్వానంద్ చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. శర్వానంద్ ఈ ఏడాది వచ్చిన మొదటి పండుగ సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించారు. అలాగే ఏప్రిల్ 03న తన ‘బైకర్’ సినిమాను విడుదల చేసి విజయాన్ని అందుకున్నారు. ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టి, ఇప్పుడు మూడో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు శర్వా.

బన్నీ కష్టపడే తత్త్వం అంటే ఇష్టం..

ఇక ‘బైకర్’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ తాను సినిమాలోకి రావడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరో చెబుతూ, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనను ఎవరు ప్రభావితం చేశారో పంచుకున్నారు.

“చిన్నప్పటి నుండి చిరంజీవిని చూస్తూ పెరిగాను. ఆయనను చూసిన తర్వాతనే ఇండస్ట్రీలోకి రావాలని, మెగాస్టార్ లాగా కావాలని అనుకునేవాడిని. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ను చూసినప్పుడు అనిపించేది.. ఆయనలాగా కష్టపడాలని! ఎందుకంటే ఆయన సినిమా కోసం ప్రాణం పెడతారు. క్యారెక్టర్ కోసం తాను చేసే హోమ్ వర్క్, డిసిప్లిన్, ఫిట్‌నెస్.. ఇలా ప్రతిదానిలో తను కష్టపడే తత్త్వం నాకు ఇష్టం. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటుంది.. నేను ఎక్కువ కష్టపడటం లేదేమో, అందుకే ఇలాగే ఉండిపోయానేమో అనిపిస్తుంది. బన్నీ, నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కూడా” అంటూ అల్లు అర్జున్ గురించి శర్వానంద్ చెప్పిన మాటలకు బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో గాలిలో తేలుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *