Suryapet:

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయినులు దుర్మ‌ర‌ణం.. మ‌రో ఇద్ద‌రికి సీరియ‌స్‌

Suryapet:సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయినులు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మ‌రొక‌రికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు పాఠ‌శాల‌ల‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. క్ష‌త‌గాత్రుల‌ను సూర్యాపేట జిల్లా ఆసుప‌త్రికి చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.

Suryapet:న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో నివాసం ఉండే ఐదురుగు ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వివిధ గ్రామాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విధులు నిర్వ‌హిస్తున్నారు. సంక్రాంతి సెల‌వులు ముగిసి శ‌నివార‌మే పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌య్యాయి. వారంతా ఓ కారులో పాఠ‌శాల‌ల‌కు వెళ్తుండ‌గా రోడ్డుపై అదుపుత‌ప్పి ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

Suryapet:సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం అర్వ‌ప‌ల్లి మండ‌ల కేంద్రం స‌మీపంలో రోడ్డుపై వెళ్తుండ‌గా, కారు అదుపు త‌ప్పి బండ‌రాళ్ల‌ను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ స‌మ‌యంలో  తుంగ‌తుర్తి మండ‌ల కేంద్రంలోని క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌లో ఎస్‌వోగా ప‌నిచేస్తున్న క‌ల్ప‌నకు తీవ్ర‌గాయాలై ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు ప్ర‌ధానోపాధ్యాయుల‌కు తీవ్ర‌గాయాలై ప్రాణాపాయ ప‌రిస్థితిలో ఉన్నారు. వారిని సూర్యాపేట‌కు త‌ర‌లించారు. రావుల‌ప‌ల్లి స్కూల్‌లో ప్ర‌ధానోపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *