PV Sindhu

PV Sindhu: ఇండియా ఓపెన్: సింధుకు చుక్కెదురు

PV Sindhu: ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. అయితే, పురుషుల సింగిల్స్‌లో సీనియర్ ఆటగాళ్లు హెచ్.ఎస్. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ అద్భుత విజయాలతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో వియత్నాం క్రీడాకారిణి న్గుయెన్ థుయ్ లిన్ చేతిలో సింధు 22-20, 12-21, 15-21 తేడాతో ఓడిపోయింది. మొదటి సెట్ గెలిచి ఊపుమీద కనిపించినా, ఆ తర్వాత వరుస రెండు సెట్లలో థుయ్ లిన్ దూకుడు ముందు సింధు నిలబడలేకపోయింది.

Also Read: Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ఈ ఓటమితో టోర్నీలో సింధు ప్రయాణం ముగిసింది. హాంకాంగ్ ఆటగాడు లీ చెక్ యియుతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రణయ్ 22-20, 21-18తో విజయం సాధించాడు. తదుపరి రౌండ్‌లో అతను సింగపూర్‌కు చెందిన లో కీన్ యూతో తలపడనున్నాడు. తోటి భారతీయుడు తరుణ్ మన్నెపల్లిపై 15-21, 21-6, 21-19తో శ్రీకాంత్ కష్టపడి విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పోను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా, యువ క్రీడాకారిణి తన్వీ శర్మ ప్రపంచ నంబర్ 2 వాంగ్ జి యీ (చైనా)పై పోరాడి ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి ప్రత్యర్థి జట్టు ‘వాకోవర్’ ఇవ్వడంతో నేరుగా రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *