Virat Kohli

Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌పై వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచి, దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 1,750 పరుగులు చేయగా, రెండో వన్డేలో తొలి బంతికే ఫోర్ కొట్టిన కోహ్లీ.. సచిన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1,773 పరుగులు ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్ళీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రోహిత్ శర్మను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇదే సిరీస్‌లోని తొలి వన్డేలో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా (624 ఇన్నింగ్స్‌లలో) 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్రపంచ ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. 1,971 పరుగులతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *