hyderabad

Hyderabad: మాయమాటలతో నమ్మించి.. 10 తులాల బంగారం నొక్కేసింది.

Hyderabad: ఆడోళ్లకి ఆడోళ్లే శత్రువులు అనడాన్ని నిజం చేసే ఘటన. కనిపించిన ప్రతిసారి ఆప్యాయంగా మాట్లాడేది.. తన గురించి అడిగితెలుసుకోవడం, ఈ వయసులో ఒంటరిగా ఉండటం గ్రేట్ అంటూ మరో వైపు ఒంటరిగా ఉంటేకలిగే బదులు నాకు తెలుసనీ ఇలా చెపుతూనే, ఆమె మెడలో ఉన్న బంగారంపై కన్నేసింది. ఎలాగైనా కొట్టేయాలని ఆలోచించేది అందులో భాగంగానే ఇంకో ఇద్దరితోని కలిసి ప్లాన్ చేసింది అనుకున్నట్టుగానే ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై స్ప్రే కొట్టి బంగారం దోచుకెళ్లింది.

ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. మంగళవారం రోజు హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్మాన్‌ఘాట్ లో ఈ ఘటన జరిగింది. సుగుణ(66)వృద్దురాలు పద్మనగర్ కాలనీలో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఆమె కుమారుడు లండన్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆమెతో పరిచేయం పెంచుకుంది సుమిత్ర అనే మహిళా.

ఇది కూడా చదవండి: ICC: బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల వేదిక మార్పుకు నిరాకరణ!

రోజు కలవడం మాట్లాడంతో పరిచేయం కాస్త బలంగా మారింది. ఇదే అలుసుగా చేసుకున్న సుమిత్ర ఇంకో ఇద్దరు భార్యాభర్తలు అయినా శివకృష్ణ, సుశీలతో కలిసి బంగారం కోట్టేయడానికి ప్లాన్ చేసింది. అందులో భాగంగా వృద్దురాలి ఇంటికి ఆమెతో పాటు భార్యాభర్తలను తీసుకోని వెళ్లింది. కొంత సమయం గడిచిన తరువాత ఇంట్లో ఎవరు లేక పోవడంతో ధైర్యం తెచ్చుకొని తనతో తీసుకొచ్చిన స్ప్రే ని ఆమె మొఖం పైన కొట్టింది. వెంటనే వృద్దురాలు స్పృహ కోల్పోయింది. ఆమె మెడలో ఉన్న 10తులాల బంగారాన్ని తీసుకోని ముగ్గురు పరారైపోయారు.

బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకృష్ణ,సుశీల,సుమిత్రలని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

వయసు పెరుగుతున్న సమయంలో కుటుంబంతోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న వృద్దులనే టార్గెట్ చేసుకుంటూ చాలా మంది తిరుగుతున్నారు. ముందుగా వాళ్లతో ప్రేమగా మాట్లాడటం తర్వాత వాళ్ళకి సంబందించిన కుటుంబ విషయాలు తెలుసుకోవడం. తర్వాత తమ ప్లాన్ అమలుచేస్తారు. ఒంటరితనంలో మనతో మాట్లాడానికి ఎవరైనా ఉంటె బాగుండని అందరూ కోరుకుంటారు. దాన్నే ఆసరాగా తీసుకుంటున్నారు కేటుగాళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *