Telangana: మూడే రోజులు.. రూ.1,000 కోట్ల మద్యం తాగేశారు. ఇది నిజమా? అంటే నిజమేనని తేలింది. నూతన సంవత్సరం సందర్భంగా ఇది సాధ్యమైంది. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్య విక్రయాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ నెలలో ఆఖరి మూడు రోజుల్లో ఆ విక్రయాలు రూ.1,000 కోట్లకు చేరినట్టు అధికారిక లెక్కలు తేల్చి చెప్తున్నాయి.
Telangana: డిసెంబర్ నెలలో 31వ తేదీ కలుపుకొని ఆఖరి మూడురోజుల్లో 8.30 లక్షల కేసుల మద్యం బాటిళ్లు, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులే లెక్కలను తేల్చారు. ఈ మూడురోజులు కలుపుకొని డిసెంబర్ నెలలో ఆఖరి ఆరు రోజుల్లో రూ.1,350 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని వివరించారు.
Telangana: ముఖ్యంగా డిసెంబర్ 31న విక్రయాల వేళలను మార్పు చేయడం కూడా మద్యం విక్రయాల పెరుగుదలకు కలిసొచ్చింది. ఈ రోజు మద్యం దుకాణాలకు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచే అవకాశం ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు పెరిగినట్టు తెలుస్తున్నది.
