ACB Raids: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది కాలంలో ఏసీబీ (Anti Corruption Bureau) దూకుడు పెంచింది. మునుపెన్నడూ లేనంతగా అవినీతి అధికారులపై దాడులు చేపట్టింది. అవినీతి జలగలకు దడ పుట్టిస్తూ వస్తున్నది. పెద్ద ఎత్తున అవినీతి అధికారులను కటకటాలు లెక్కిస్తున్నది. ఈ మేరకు ఒక్క 2025 సంవత్సరంలోనే 199 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 273 మంది నిందితులను అరెస్టు చేసింది. ఇది గత సంవ్సరాల కంటే అధికం కావడం విశేషం.
ACB Raids: తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా చారు సిన్హా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏసీబీ జులు విదిల్చిందని పలువురు విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఆమె వచ్చాకే అవినీతి ఫిర్యాదుల కోసం క్యూఆర్ కోడ్ కంప్లైంట్ సిస్టమ్ తేవడం గమనార్హం. ఈ సిస్టమ్ ద్వారా దూర ప్రాంతాల ప్రజలు అవినీతి కార్యకలాపాలపై ఫిర్యాదులు చేసుకునేందుకు అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. అవినీతి నిరోధక వారోత్సవాలు లాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.
ACB Raids: 2025 సంవత్సరంలో ఏసీబీ దూకుడుగా వ్యవహారించి నమోదు చేసిన 199 కేసుల్లో మొత్తం 273 మంది అవినీతి తిమింగలాలను అరెస్టు చేసింది. వీటిల్లో 157 ట్రాప్ కేసుల్లో 224 మందిని అరెస్టు చేసింది. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 15 అక్రమ ఆస్తుల కేసుల్లో రూ.96.13 కోట్ల నగదును ఏసీబీ వెలికి తీసింది.
ACB Raids: అదే విధంగా 54 ఆకస్మిక తనిఖీలు చేయడంతోపాటు ఏసీబీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్పోస్టులపై దాడులు చేసిది. 115 మందిపై కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ ప్రభుత్వం నుంచి అనుమతులను కోరింది. ట్రాప్ కేసుల్లో 2025 సంవత్సరంలో రూ.57.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నది. వీటిల్లో బాధితులకు రూ.35.89 లక్షలను తిరిగి చెల్లించింది.
ACB Raids: లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా సూచించారు. అదే విధంగా వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కూడా చెప్పారు.
