Fire Accident:

Fire Accident: మేడ్చ‌ల్ జిల్లాలో అగ్నిప్ర‌మాదం

Fire Accident: మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. మేడ్చ‌ల్ జిల్లాలోని పోచారం కారిడార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని అన్నోజిగూడ‌లోని భార‌త్ పెట్రోల్ బంక‌లో ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. బంక్‌లోకి వ‌చ్చిన ఓ మారుతీ వ్యాన్‌కు మంట‌లు అంటుకున్నాయి. అది పూర్తిగా ద‌హ‌న‌మైపోయింది. మంట‌లు ఎగిసిప‌డ‌టంతో ఎవ‌రూ ద‌రిదాపుల్లో లేకుండా దూరంగా వెళ్లిపోయారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *