Saidi Arabia:

Saidi Arabia: సౌదీలో మ‌ద్య‌నిషేధానికి 75 ఏళ్లు.. దానికి కార‌ణ‌మైన అతి పెద్ద సంఘ‌ట‌న‌ ఇదే!

Saidi Arabia: సౌదీ అరేబియా దేశంలో అమ‌లవుతున్న మ‌ద్యనిషేధానికి 75 ఏళ్లు కావ‌స్తున్న‌ది. ప్ర‌పంచంలో ముఖ్యంగా సౌదీ స‌హా మిగ‌తా గ‌ల్ఫ్‌, ముస్లిం దేశాల్లో ఇప్ప‌టికీ మ‌ద్యనిషేధం అమ‌ల‌వుతున్న‌ది. ఈ ఏడాదే సౌదీ అరేబియా దేశంలో ప‌రిమిత‌, కేర్‌ఫుల్ ఆల్క‌హాల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ముస్లిమేత‌రులు, అధికాదాయం ఉన్న నివాసితుల‌కు మాత్ర‌మే మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తారు. ముస్లింల‌కు మాత్రం అమ్మ‌కాలు ఉండ‌వు.

Saidi Arabia: ఇప్ప‌టికీ సౌదీ పౌరులు, ముస్లింల‌కు మ‌ద్యం అమ్మ‌డం, తాగ‌డం చ‌ట్ట‌విరుద్ధం. అయితే ఆ దేశంలో ఎక్స్‌పో 2030, 2034లో జ‌రిగే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ వంటి భారీ ఈవెంట్స్ సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని వివిధ దేశాల నుంచి ప్ర‌తినిధులు, క్రీడాకారులు సౌదీ అరేబియాకు వ‌స్తారు. ఈ స‌మ‌యాల్లో ప్ర‌త్యేక టూరిస్టు జోన్ల‌లో నియంత్రిత మ‌ద్యాన్ని అమ్మేందుకు ఆదేశ ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తున్న‌ది. అయితే అస‌లు ఆ దేశంలో మ‌ద్య‌నిషేధానికి దారితీసిన ఓ కీల‌క సంఘ‌ట‌న‌ను మ‌నం తెలుసుకుందాం.

Saidi Arabia: సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా న‌గ‌రం.. రాజ‌ధాని న‌గ‌ర‌మైన రియాద్ త‌ర్వాత రెండో అతి పెద్ద న‌గ‌రం. ఆ న‌గ‌రంలో 1951లో ఓ హింసాత్మ‌క సంఘ‌ట‌న జ‌రిగింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత నుంచే మ‌ద్య‌పాన నిషేధం అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆ సంవ‌త్స‌రం బ్రిటీష్ వైస్ కాన్సుల్ సిరిల్ ఉస్మాన్ జెడ్డా న‌గ‌రంలోని త‌న ఇంటిలో అతిథుల‌కు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యానికి 19 ఏళ్ల వ‌య‌సున్న అప్ప‌టి సౌదీ రాజ‌కుమారుడు ప్రిన్స్ మిషారీ బిన్ అబ్దుల్ అజీజ్ కూడా హాజ‌ర‌య్యారు.

Saidi Arabia: ప్రిన్స్ మిషారీ బిన్ అబ్దుల్ అజీజ్‌కు మ‌ద్యం ఎక్కువ‌గా తాగే అల‌వాటు ఉండేది. సాయంత్రం పూట అత‌ను మ‌ద్యం పూటుగా తాగి ఓ ఆంగ్ల మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌ని ప్ర‌వ‌ర్త‌న వికృతంగా కూడా మారింది. ఆ స‌మ‌యంలో ఉస్మాన్ అత‌నికి మ‌ద్యం ఇవ్వ‌డాన్ని ఆపేశాడు. అక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని కోరాడు. అప్ప‌టికి వెళ్లిపోయిన యువ‌రాజు మ‌రునాడు మ‌ద్యంతాగిన ఆ బ్రిటీష్ మ‌హిళ కోసం ఉస్మాన్ ఇంటికి వ‌చ్చాడు.

Saidi Arabia: యువ‌రాజు అబ్దుల్ అజీజ్ రాక‌ను ఉస్మాన్ నిరాక‌రించాడు. ఇంటిలోకి రాకుండా అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువ‌రాజు అజీజ్ త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని తీసి విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఆ కాల్పుల్లో ఉస్మాన్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. అత‌ని భార్య‌కు గాయాల‌య్యాయి. ఈ హ‌త్య ఇత‌ర‌ ప్రపంచంతో దౌత్య సంక్షోభానికి దారితీసింది. రాజ‌కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసింది. విచ్చ‌ల‌విడి మ‌ద్యం.. విదేశీ సంబంధాల‌ను ఎలా బెదిరిస్తుందో ఈ ఘ‌టన కండ్లారా చూపించింది.

Saidi Arabia: ఈ ఘ‌ట‌న‌పై సౌదీ అరేబియా రాజు అబ్దుల్ అజీజ్ ఆగ్ర‌హోద‌గ్రుడ‌య్యారు. హ‌త్యా నేరానికి పాల్ప‌డిన త‌న కొడుకైనా యువ‌రాజును అరెస్టు చేయాల‌ని అప్ప‌టిక‌ప్పుడే ఆదేశించారు. ఏకంగా నిందితుడికి మ‌ర‌ణ శిక్ష విధించాడు. అయితే హ‌తుడైన‌ ఉస్మాన్ భార్య‌కు ఉరిశిక్ష ప‌ద్ధ‌తిని ఎంచుకునే హ‌క్కును ఇచ్చారు. దానికి నిరాక‌రించిన ఆ మ‌హిళ 70,000 డాల‌ర్ల ప‌రిహారాన్ని తీసుకునేందుకే అంగీక‌రించింది.

Saidi Arabia: యువ‌రాజు మ‌ర‌ణ శిక్ష.. విచార‌ణ త‌ర్వాత జైలు శిక్ష‌గా మార్చారు. ఆ త‌ర్వాత నెల‌కు ఇరువై కొర‌ఢా దెబ్బ‌ల‌కు త‌గ్గించారు. అయినా మ‌ద్యం, ఇత‌ర విదేశీ అలవాట్లు ఈ విషాద ఘ‌ట‌న‌లో కీల‌క పాత్ర పోషించాయ‌ని నిర్ధిరించుకున్న సౌదీ రాజు దేశ‌మంత‌టా మ‌ద్యం దిగుమ‌తి, అమ్మ‌కాలు, వినియోగంపై నిషేధిస్తూ ఒక భారీ ఉత్త‌ర్వును జారీ చేశారు. 1952 ఆఖ‌రు నాటికి సౌదీ అరేబియా దేశంలో మ‌ద్యం పూర్తిగా క‌నిపించ‌కుండా పోయింది. అక్క‌డ ప‌నిచేసే ఆయిల్ కార్మికుల‌కు నెల‌కు మూడు బాటిళ్ల చొప్పున విస్కీ కొనేందుకు ప‌ర‌మితం విధించి, కొన్నాళ్ల‌కు స‌ర‌ఫ‌రాను పూర్తిగా నిలిపివేశారు. ఇదీ క‌థ అన్న‌మాట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *