Mahabubabad: వివాహేతర బంధానికి అడ్డు ఉన్నాడని, హోంలోన్ మాఫీ అవుతుందని ప్రియుడితో కలిసి ఏకంగా భర్తనే అతని భార్య హతమార్చింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం మండలం బోడమంచ తండాలో భూక్య వీరన్న తన భార్య విజయతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే తండాలో నివాసం ఉండే బోడ బాలాజీతో విజయకు వివాహేతర సంబంధం ఉన్నది.
Mahabubabad: భూక్య వీరన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వ్యవసాయ భూమిని విక్రయించి అప్పులు చెల్లించాడు. అయినా ఇంకా అప్పులు మిగిలి ఉండటంతో బోడ బాలాజీతోపాటు ఆర్ఎంపీ వైద్యుడు ధర్మారపు భరత్ కలిసి ముత్తూట్ ఫైనాన్స్‌లో వీరన్నకు హోంలోన్ ఇప్పించారు. ప్రమాదవశాత్తు లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ లోన్ మాఫీ అవుతుందని విజయకు తెలిసింది. దీంతో ఆమెలో ఓ ఆలోచన రేకెత్తింది.
Mahabubabad: తన భర్తను చంపేస్తే లోన్ మాఫీ అవుతుందని విజయ, బాలాజీ భావించింది. వీరన్నను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. డిసెంబర్ 22న ఆర్ఎంపీ భరత్ సహాయంతో భూక్య వీరన్నను మద్యం తాగుదామని తండా బయట ఉన్న పామాయిల్ తోట వద్దకు రప్పించారు. వీరన్నకు బోడ బాలాజీ, ధర్మారపు భరత్‌లు బాగా మద్యం తాగించారు.
Mahabubabad: అనంతరం బోడ బాలాజీ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో వీరన్న తల వెనుక బలంగా కొట్టాడు. టవల్‌తో వీరన్న ముక్కు, నోరును ధర్మారపు భరత్ మూశాడు. దీంతో వీరన్న ప్రాణాలిడిచాడు. వీరన్న మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి దినేష్ అనే వ్యక్తి పొలంలో బైక్‌తో సహా పడేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా విచారించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిందితులు బయటకొచ్చారు. వీరన్న భార్య విజయ వివాహేతర బంధం, లోన్ మాఫీ వ్యవహారం, బాలాజీ, ధర్మారపు భరత్ విషయం బయటకు వచ్చి నిందితులపై కేసు నమోదు చేశారు. కోర్టుకు రిమాండ్ చేశారు.
