The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ది రాజాసాబ్ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ సినిమా రన్‌టైమ్ 3 గంటల 3 నిమిషాలుగా లాక్ అయింది. ప్రమోషనల్ కంటెంట్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: Shivaji: ఆ రెండు పదాలు మాత్రం తప్పు.. నా ఆడబిడ్డలు నన్ను క్షమిచండి
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. హారర్, కామెడీ, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్, మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 3 గంటల 3 నిమిషాలుగా లాక్ చేశారు. ఇటీవలి భారీ చిత్రాల ట్రెండ్‌ను అనుసరిస్తూ సుదీర్ఘ నిడివితో వస్తోంది. అయినా కథలోని వేరియేషన్స్, ఎంటర్టైన్మెంట్ కారణంగా బోర్ కొట్టకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
