Andhra Pradesh:

Andhra Pradesh: ఏపీలో మ‌రో కొత్త స్కీం అమ‌లుకు శ్రీకారం

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ప్ర‌భుత్వం మ‌రో కొత్త కార్య‌క్ర‌మం అమ‌లుకు శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల అమ‌లుతో దూసుకుపోతున్న ఆ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల విద్యార్థుల కోసం ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్న‌ది. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ కార్య‌క్ర‌మ అమ‌లు కోసం ఆదేశాల‌ను జారీచేసింది. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు యాజ‌మాన్యాల ప‌రిధిలోని అన్ని విద్యాసంస్థ‌ల్లో త‌క్ష‌ణ అమ‌లుకు ముందుకొచ్చింది.

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయి విద్యార్థుల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణను పెంపొందించే ల‌క్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ముస్తాబు అనే కొత్త కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. తొలుత పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ ముస్తాబు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌భుత్వం అమ‌లు చేసి స‌త్ఫ‌లితాల‌ను సాధించింది. అక్క‌డి విజ‌యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది.

Andhra Pradesh: ప్ర‌భుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌తో పాటు గురుకులాలు, వ‌స‌తి గృహాలు, జూనియ‌ర్ క‌ళాశాల్లోనూ ఈ ముస్తాబు కార్య‌క్ర‌మాన్ని త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను ఇచ్చింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా విద్యార్థుల్లో కేవ‌లం ప‌రిశుభ్ర‌తే కాకుండా, మంచి వ్య‌క్తిత్వం, క్ర‌మ‌శిక్ష‌ణ వంటి సుగుణాల‌ను అల‌వ‌ర్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్దేశించింది. ఈ నూత‌న కార్య‌క్ర‌మ అమ‌లుకు సంబంధించిన విధివిధానాల‌ను పాఠ‌శాల విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ ఆయ‌న జారీచేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఇక‌పై రాష్ట్రంలోని విద్యార్థులంతా ప్ర‌తిరోజూ ముస్తాబు కావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *