Japan: అవును.. మీరు చూసిన టైటిల్ కరెక్టే. వామ్మో ఇదెక్కడి గోల అనుకుంటున్నారా? ఇది మన దేశంలో కాదు లెండి. జపాన్ లో. అయినా.. మనదేశంలో ఫోన్ మాట్లాడుతూ ఏమి నడిపినా పొతే పక్కోడు పోతాడు కానీ.. మనకేం నష్టం ఉండదు. పైగా ఎప్పుడైనా పోలీసోళ్లు పట్టుకున్నా.. మహా అయితే ఓ వెయ్యి రూపాయలు (అది కూడా మనం కడితే కదా!) ఫైన్ వేయొచ్చేమో. అసలు ఆ అవకాశమే లేదు అనేది వేరే విషయం. కానీ, జపాన్ లో అలాకాదు. రూల్స్ అంటే రూల్స్ అంతే.
సైక్లింగ్ చేస్తూ స్మార్ట్ ఫోన్ కాల్ చేయడం లేదా స్క్రీన్ చూడడం చేస్తే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.55,000 వరకు జరిమానా వేస్తారు అక్కడ. ఇది ఎక్కడో కాదు ఆర్ధికంగా అభివృద్ధి చెందిన టాప్ 5 దేశాలలో ఒకటైన జపాన్ లో. సైక్లిస్టులు మొబైల్ స్క్రీన్లను చూడటం వల్ల జరిగిన కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో నడిచి వెళ్లే వారి మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Gold rate: షాకిస్తున్న బంగారం.. రోజు రోజుకు పై పైకి
Japan: నవంబర్ 1 నుండి కఠినమైన కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, మద్యం తాగి సైక్లింగ్ చేస్తే రైడర్ కి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష రూ. 2.75 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జపాన్ లో మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, సైకిళ్లతో సంబంధం ఉన్న ప్రమాదాల నిష్పత్తి పెరుగుతోంది. అందుకే, కఠినంగా వ్యవహరించాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది.
ఏంటీ మన దేశంలో కూడా ఇలాంటి రూల్స్ వస్తే బాగుండును అనుకుంటున్నారా? మీరు మరీను.. ఆశకు కూడా హద్దుండాలి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. అవతలి వాడు తాగి మిమ్మల్ని ఢీ కొట్టకూడదని దేవుణ్ణి వేడుకోండి. అంతేకానీ.. ఇలాంటి కఠినమైన విధానాల కోసం ఎదురు చూడకండి.