Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. 2,723 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.8 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ బంగారాన్ని ఓ కేటుగాడు పేస్టుగా మార్చి, ప్లాస్టిక్ కవర్‌లో దాచాడు. అక్రమంగా బంగారాన్ని దేశం అంతటా తరలించే ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు.
కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో శానిటరీ చెకింగ్ నిర్వహిస్తుండగా, యాపిల్ ప్యాకింగ్ లో దాచిన ఈ బంగారం బయట పడింది. స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించడానికి కస్టమ్స్ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుడిని తనిఖీ చేయగా బంగారం దొరికింది.బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి కస్టమ్స్ శాఖ కేసు నమోదు చేసి, యువకుడిని అరెస్ట్ చేసింది. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు