Crime News: మనల్ని ఎవడ్రా ఆపేది. కెజిలైనా..డోంట్ కేర్. లోడు ఎత్తు ..ఎక్కడికి రావాలో చెప్పు. అక్కడికి టైం మిస్ కాకుండా డెలివరీ చేస్తా . కానీ..చెక్ పోస్ట్ లు ఉంటాయి కదా ? అదే కదా చెప్పేది. చెక్ పోస్ట్ లు ఉంటె ..ఏమవుతుంది. పోలీసుల కళ్ళు గప్పి ఎస్కేప్ అవ్వడం మనకు బాగా తెలుసు. ఈ సారి కూడా అలానే చేద్దాం. ఓకే అనుకున్నారు బండి స్టార్ట్ చేసారు . స్పీడ్ గా వెళ్లారు..దొరికిపోయారు
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి చెక్‌ఫోస్టు వద్ద పోలీసులు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి వివరాలను వెల్లడించారు.
Crime News: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా అవుతున్నట్టు రావికమతం మండలం కొత్తకోట పోలీసులకు సమాచారం అందింది. దీంతో దొండపూడి చెక్‌పోస్టు వద్ద కల్యాణపులోవ రిజర్వాయర్ నుంచి వచ్చే దారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వస్తున్న ఒక కారును ఆపి తనిఖీ చేయగా 110 కిలోల గంజాయి లభ్యమైంది.
కారులో ఉన్న కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లాకు చెందిన ఒకరు, కర్ణాటక రాష్ట్రం పుట్టూరు ఉపజిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ప్రాంతంలో ఒక వ్యక్తికి రూ.2.5 లక్షలు చెల్లించి గంజాయి కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు.
Crime News: గంజాయిని తాజంగి, బుసిలికోట మీదుగా కూలీల సహాయంతో కల్యాణపులోవ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో తరలిస్తుండగా దొండపూడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు.