Crime News: ఒకే ఒక జీవితం. ఉన్న ఈ ఒక్క జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి …పోతాయి. వచ్చాయి కదా అని..ప్రాణాలను తీసుకుంటే…ప్రాణానికి విలువ ఉందా ? తెలిసి తెలియని వయసులో ఇలా చేస్తున్న చిన్నారులు …మీకు ఎంతో భవిష్యత్తు ఉంది.. ఐన ఒక్కటి మనం ఎన్ని మాట్లాడుకున్నా..ఇంట్లో తల్లితండ్రులు మీరు ఒక్కసారి ఆలోచించండి. నవమాసాలు మోసి కన్న బిడ్డలు …మన ప్రాణాలు అని వారి రక్షణ మన బాధ్యత అని . కానీ..ఈ చిణ్ణరి మరణం నిజం గా విశాదం.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో విషాదం నెలకొంది. 10వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ. తరగతి చదువుతున్నారు వెంకటేష్. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Crime News: అనారోగ్య సమస్యలతో విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండల కేంద్రంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల శ్రీనివాస్ – అంజవ్వ దంపతుల చిన్న కుమారుడు అలువాల వెంకటేష్ అనే విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడు సుద్దాల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.
గతంలో కూడా వెంకటేష్ పలు కారణాల వలన ఆత్మహత్యకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు.కొడుకు మృతితో బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.